రైల్వేలో 1000 పోస్టుల ఖాళీలు.. పదో తరగతి అర్హత ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసుకోండీ..

By Sandra Ashok Kumar  |  First Published Sep 7, 2020, 2:04 PM IST

ఇందులో కార్పెంటర్-80, ఎలక్ట్రీషియన్-200, ఫిట్టర్-260, మెషినిస్ట్-80, పెయింటర్-80, వెల్డర్-290, ఎం‌ఎల్‌టి రేడియాలజీ-4, ఎం‌ఎల్‌టి పాథాలజీ-4, పి‌ఏ‌ఎస్‌ఎస్‌ఏ-2  మొత్తం 1000 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
 


చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వెయ్యి అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఇందులో కార్పెంటర్-80, ఎలక్ట్రీషియన్-200, ఫిట్టర్-260, మెషినిస్ట్-80, పెయింటర్-80, వెల్డర్-290, ఎం‌ఎల్‌టి రేడియాలజీ-4, ఎం‌ఎల్‌టి పాథాలజీ-4, పి‌ఏ‌ఎస్‌ఎస్‌ఏ-2  మొత్తం 1000 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

Latest Videos

undefined

అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద శిక్షణ ఇవ్వడానికి ఐసిఎఫ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఫ్రెషర్, ఎక్స్-ఐటిఐ రెండింటి నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐసిఎఫ్ రైల్వే రిజిస్ట్రేషన్ pbicf.in  లింక్ సెప్టెంబర్ 04 నుండి 2020 సెప్టెంబర్ 25 వరకు పనిచేస్తుంది.


అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 10+2/ త‌త్స‌మాన‌ విధానంలో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎన్‌సీవీటీ స‌ర్టిఫెట్‌ ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

also read 
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 4, 2020
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 25, 2020

ఫ్రెషర్ అభ్యర్థులకు శిక్షణ కాలం 2 సంవత్సరాలు / 1 సంవత్సరం 3 నెలలు, ఎక్స్-ఐటిఐకి శిక్షణ కాలం 1 సంవత్సరం.

వయో పరిమితి: 15 నుండి 24 సంవత్సరాలు ( ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అంగ వైకల్యాలున్న అభ్యర్థులకు 10 సంవత్సరాలు (పిడబ్ల్యుబిడి) సడలింపు ఉంటుంది.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) రైల్వే అప్రెంటిస్ జీతం:
ఫ్రెషర్స్ - 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే : నెలకు 6000 / -
ఫ్రెషర్స్ - 12వ తరగతి ఉత్తీర్ణత ఉంటే : నెలకు 7000 / -
మాజీ ఐటిఐ వారికి: నెలకు 7000 / -

మరింత సమాచారం కోసం https://pbicf.in/index.php  పై క్లిక్ చేయండి

click me!