ఇండియన్ ఆర్మీలో అర్హతగల పెళ్లికాని పురుషులు, పెళ్లికాని ఫిమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాలకి సంబంధించిన కోర్సు ఏప్రిల్ 2021లో చెన్నై, తమిళనాడులోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ)లో ప్రారంభమవుతుంది.
ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ రిక్రూట్మెంట్ 2020: ఇండియన్ ఆర్మీలో అర్హతగల పెళ్లికాని పురుషులు, పెళ్లికాని ఫిమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాలకి సంబంధించిన కోర్సు ఏప్రిల్ 2021లో చెన్నై, తమిళనాడులోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ)లో ప్రారంభమవుతుంది. కోర్సు వ్యవధి 49 వారాలు. మొత్తం ఇందులో ఉన్న ఖాళీలు 189. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 14 అక్టోబర్ 2020న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమై 12 నవంబర్ 2020తో ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులకు 175 ఖాళీలు, మహిళలకు 14 ఖాళీలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 189
1. పురుషులు- 175
సివిల్- 49
ఆర్కిటెక్చర్- 1
బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
మెకానికల్- 15
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 16
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 47
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 21
ఎలక్ట్రానిక్స్- 3
మైక్రో ఎలక్ట్రానిక్స్- 3
ఏరోనాటికల్- 5
ఏవియానిక్స్- 5
ఏరోస్పేస్- 1
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 2
ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
టెక్స్‌టైల్- 1
ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్- 1
undefined
also read
2. మహిళలు- 14
సివిల్- 3
ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
మెకానికల్- 1
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 2
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 2
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4
ఏరోనాటికల్- 1
ముఖ్య సమాచారం:
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు: 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 12, 2020.