డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తూ చేసుకొండి..

By Sandra Ashok KumarFirst Published Oct 12, 2020, 5:42 PM IST
Highlights

 నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌టి‌ఐ) బోధన, బోధనేతర పోస్టుల కోసం ఆసక్తి, అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రైల్వే ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.  నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌టి‌ఐ) బోధన, బోధనేతర పోస్టుల కోసం ఆసక్తి, అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ  నవంబర్ 10.  అధికారిక వెబ్ సైట్ nrti.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest Videos

'ప్రొఫెసర్ / అసోసియేట్ ప్రొఫెసర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం  అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి యుజిసి రెగ్యులేషన్స్‌తో పిహెచ్‌డి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి, ప్రొఫెసర్‌గా కనీసం ఐదు నుంచి పదేళ్ల అనుభవం ఉన్నవారికి  ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్: అభ్యర్థి విశ్వవిద్యాలయం/ ఏదైనా సంస్థలోని ఆర్థిక విభాగంలో పనిచేసిన అనుభవం ఉండి ఎంబీఏ పాస్ అయ్యి ఉండాలి.

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: అభ్యర్థికి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఏదైనా విశ్వవిద్యాలయం / సంస్థలో ఆర్థిక విభాగంలో పనిచేసి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

also read 

అసిస్టెంట్ లైబ్రేరియన్: అభ్యర్థికి లైబ్రేరియన్‌గా పనిచేసి అనుభవం ఉన్న లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. పోస్ట్ సంబంధిత, విద్యా అర్హత, అనుభవం వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 55 సంవత్సరాలు మించకూడదు.

జీతం: 7వ వేతన సంఘం (సిపిసి) సిఫారసుల మేరకు అభ్యర్థులకు జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 11 అక్టోబర్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10 నవంబర్

click me!