నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఖాళీలు…

By Sandra Ashok KumarFirst Published Mar 4, 2020, 12:37 PM IST
Highlights

లంగాణ రాష్ట్రంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు  తీపికబురు చెప్పింది.  తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల జారీ చేసింది.
 
ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఆర్‌ఇఐ-ఆర్‌బి ఛైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గతంలో ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆ పోస్టులతో పాటుగా వీటిని కూడా అదనంగా చేర్చారని దీనితో కలిపి మొత్తంగా 34 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest Videos

also read ప్రారంభమయిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు...నేడు ఫస్ట్ ఇయర్ పరీక్ష...


ఇదిలా ఉంటే ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులు సాధించినవారు దీనికి అర్హులు. ఇక అంతకముందు గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 10 వరకు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

కాగా, దరఖాస్తు చేసుకున్నవారు సలహాలు, సంప్రదింపుల కొరకు అన్నీ రోజులూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040- 23317140 హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. 


వయో పరిమితి- 34 నుంచి 44 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు- రూ.2,000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.1,200

click me!