ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది. అర్హతగల అభ్యర్ధులు వెంటనే అప్లయ్ చేసుకోండీ.
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
undefined
ఇందులో మొత్తం 107 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. 2018లో 92 పోస్టుల్ని భర్తీ చేసిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈసారి మరికొన్ని పోస్టులను జోడించి 107 ఖాళీలను భర్తీ చేస్తోంది.
లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఖాళీగా ఊన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ తేదీ ఆగస్ట్ 17న ప్రారంభమైంది.
అయితే చివరి తేదీ సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల్లోగా అప్లయ్ చేసుకోవచ్చు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 1, టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)- 59, టెక్నికల్ అసిస్టెంట్ (మెయింటనెన్స్)- 3, స్టెనో గ్రేడ్ 2: 4, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 40 పోస్టులున్నాయి.
వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.700. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.300.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://frirecruitment.icfre.gov.in లేదా http://fri.icfre.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు.