బీ-టెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్‌డీఓలో 185 పోస్టులు భర్తీ సిద్దంగా ఉన్నాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఉన్న 167 సైంటిస్ట్ బీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు మొదట ప్రకటించింది. వీటికి మరో 18 పోస్టులను కొత్తగా కలుపుతున్నట్టు తాజాగా వెల్లడించింది.
దీంతో ఖాళీ పోస్టుల సంఖ్య 167 నుంచి 185 కి పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 22 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 10 జూలై 2020 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
undefined
డీఆర్‌డీఓలో ఉన్న ఖాళీల పూర్తి వివరాలు...
మొత్తం ఉన్న ఖాళీలు సంఖ్య: 185
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 41
మెకానికల్ ఇంజనీరింగ్: 43
కంప్యూటర్ సైన్స్: 32
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 12
మెటల్లార్జీ: 10
ఫిజిక్స్: 8
కెమిస్ట్రీ: 7
also read ఏపీ డీసెట్ నోటిఫికేషన్ విడుదల... దరఖాస్తు చేయండిలా... ...
కెమికల్ ఇంజనీరింగ్: 6
ఏరోనాటికల్ ఇంజనీరింగ్: 9
సివిల్ ఇంజనీరింగ్ : 3
మ్యాథమెటిక్స్: 4
సైకాలజీ: 10
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 22 మే 2020, దరఖాస్తుకు చివరి తేదీ- 10 జూలై 2020
విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గేట్, నెట్ స్కోర్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాల ,.దరఖాస్తు చేయడానికి https://rac.gov.in/index.php?lang=en&id=0 క్లిక్ చేయండి