FCI Jobs: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ వివరాలు ఇవే..

By asianet news telugu  |  First Published May 11, 2022, 12:17 PM IST

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4710 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్‌-2,3,4 కేటగిరీల్లో ఈ ఖాళీలు ఊన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ప్రభుత్వ ఉద్యోగుల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4710 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్‌-2,3,4 కేటగిరీల్లో ఈ ఖాళీలు ఊన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన మొత్తం నోటిఫికేషన్‌ ఇంకా వెల్లడి కాలేదు. షార్ట్‌ నోటీస్‌ మాత్రమే వెలువడింది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య: 4710
కేటగిరీ 2లో  35 పోస్టులు, కేటగిరీ 3 - 2521 పోస్టులు , కేటగిరీ 4 (వాచ్‌మెన్‌) - 2154 పోస్టులు కేటాయించారు.

Latest Videos

విద్యార్హతలు: పోస్టులను బట్టి 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎంపిక చేసే విధానం: వ్రిటెన్ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా సెలెక్షన్స్  ఉంటాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://fci.gov.in/ చూడండి 

click me!