డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకొండి..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2021, 05:04 PM ISTUpdated : Feb 08, 2021, 05:12 PM IST
డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకొండి..

సారాంశం

‌ఓ‌ఎన్‌ఎల్ సంస్థ దేశావ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా  ఉన్న  పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బి‌ఓ‌ఎన్‌ఎల్) సంస్థ దేశావ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా  ఉన్న  పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఫిబ్రవరి 15 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు https://www.bharatiyapashupalan.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తంఖాళీ  పోస్టులు సంఖ్య: 3216

సేల్స్‌ మేనేజర్‌- 64, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌- 485, సేల్స్‌ హెల్పర్‌- 2667

also read రాత పరీక్ష లేకుండా 10th పాసైన వారికి ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో నియమకాలు.. ...

అర్హత: సేల్స్‌మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు  ఇంటర్‌, సేల్స్‌ హెల్పర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయసు: సేల్స్‌ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్‌. ఇందులో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://www.bharatiyapashupalan.com/

PREV
click me!

Recommended Stories

BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్