DRDO Recruitment 2022:630 ఉద్యోగ ఖాళీలు.. జూలై 29 వరకు ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

By asianet news teluguFirst Published Jul 18, 2022, 1:49 PM IST
Highlights

డి‌ఆర్‌డి‌ఓ జారీ చేసిన ప్రకటన (నం.140) ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇతర విభాగాలలో మొత్తం 630 సైంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనుంది.

డి‌ఆర్‌డి‌ఓలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్‌డిఓ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ)లో వివిధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.  డి‌ఆర్‌డి‌ఓ జారీ చేసిన ప్రకటన (నం.140) ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇతర విభాగాలలో మొత్తం 630 సైంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనుంది.  

జూలై 29 వరకు ఆన్‌లైన్‌లోగా దరఖాస్తు చేసుకోండి

Latest Videos

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.inలో అందించే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా DRDO, DST అండ్ ADAలోని సైంటిస్ట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 6 నుండి ప్రారంభమై 29 జూలై 2022 వరకు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ మార్గాల ద్వారా రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు దరఖాస్తు పేజీలో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ ప్రకటన, సూచనలను జాగ్రత్తగా చదవాలి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
DRDA, DST & ADAలో సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు సంబంధిత ఖాళీల విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ (పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా గేట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి DRDOకి 28 సంవత్సరాలు, DSTకి 35 సంవత్సరాలు, ADAకి 30 సంవత్సరాలు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు (SC, ST అండ్ OBC) చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది, మరిన్ని వివరాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనను చూడండి.

click me!