నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులు ఏదైన ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ పొందవచ్చు. దీని తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు చదవటానికి విద్యార్థులు వీటిలో ఏదైనా కోర్సును ఎంచుకోవాలి.
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లోని యూజీ కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం నీట్(NEET)యూజీ టెస్ట్ 2022 జూలై 17న జరగనుంది. ఈ పరీక్ష కోసం 18 లక్షల 72 వేల 341 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ కల్పిస్తారు. ఈసారి ఈ పరీక్షను దేశంలోని 497 నగరాలు, దేశం బయట 14 నగరాల్లో నిర్వహించబోతున్నారు. నీట్ పరీక్ష అంటే ఏంటి, ఈ పరీక్షలో క్లియర్ అయిన తర్వాత విద్యార్థులు ఏం చేయాలి ? వారికి ఎక్కడ ఎంట్రెన్స్ లభిస్తుంది? నీట్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు A నుండి Z సమాచారం మీకోసం...
నీట్ పరీక్ష అంటే ఏమిటి
నీట్ అనేది మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ కావాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయాలి. ఇందులో సెలెక్ట్ అయ్యాక టాప్ ర్యాంకర్లకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ పొందుతారు. ఈ పరీక్ష సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు. దీనిని NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
undefined
NEET UG పరీక్ష 2022లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే
ఈ సంవత్సరం ఈ పరీక్ష పెన్-పేపర్ మోడ్‌లో అంటే ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. 17 జూలై 2022న జరిగే నీట్ 2022 పరీక్ష తర్వాత మెడికల్ యూనివర్సిటీలో MBBS, BDS, BAMS, BUMS, BSMS, BHMS ఇతర మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సీట్స్ ఉంటాయి. NEET 2022 మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో MBBS కోసం 90, 825 సీట్లు, BDS కోసం 27,948, ఆయుష్ కోసం 52,720, BVSC (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్) అండ్ AH సీట్లు 603 కేటాయించారు.
NEET 2022 పరీక్షను క్లియర్ చేసిన తర్వాత ఏం చేయాలి
NEET 2022 పరీక్షలో కట్ ఆఫ్ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులు అడ్మిషన్ కి అర్హులు. దీని తర్వాత విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచి ఉత్తీర్ణులైన విద్యార్థులను 15% ఆల్ ఇండియా కోటా (AIQ), 85% రాష్ట్ర కోటా సీట్ల ఆధారంగా ప్రభుత్వ కళాశాలల్లో చేర్చుకుంటారు.
నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ
నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి స్కోర్‌కార్డ్ పొందిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం వారు రిజిస్టర్ చేసుకోవాలి. NTA మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఈ మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారు. నీట్‌లోని అన్ని ప్రభుత్వ సీట్లను భర్తీ చేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.