బీటెక్ పాసయ్యారా, అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో జాబ్ మీ కోసం, నెలకు రూ. 25,000 జీతం, అప్లై చేయండిలా..

By Krishna Adithya  |  First Published Sep 8, 2022, 5:58 PM IST

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది సువర్ణావకాశం,భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టలు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నెలకు రూ. 25,000 జీతం అందించనున్నారు. 


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు, కేంద్ర సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అందిస్తోంది. ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో ఉద్యోగాలకున నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వ సంస్థలు అయిన మహా రత్న, మినీ రత్న సంస్థల్లో కూడా ఉద్యోగాలను ఆహ్వానిస్తోంది.  

తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కొచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం ప్రొఫెషనల్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది. అర్హులైన, ఆసక్తిగల గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Latest Videos

undefined

పోస్టు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
ఖాళీలు: 102
స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.25,000
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం

అర్హత: ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్. 2020, 2021, 2022లో కోర్సు పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 1.9.2022 నాటికి 18 నుండి 27 మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పీఈ, బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు BBCL వెబ్‌సైట్, ఎంపికైన అభ్యర్థుల ఇమెయిల్ చిరునామాకు పంపుతారు.

ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు తమ పూర్తి వివరాలను www.mhrcdnats.gov.in వెబ్‌సైట్‌లో 8.9.2022లోపు నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత వెబ్‌సైట్ https://www.bharatpetroleum.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 13.09.2022

ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఇప్పటికే, అగ్నిపథ్ పేరిట యువతకు భద్రతా దళాల్లో ప్రవేశించే అవకాశం కల్పించింది. దీంతో పాటె ఎస్ఎస్‌సీ బోర్డు ద్వారా కూడా ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చింది. అలాగే రైల్వే బోర్డు ద్వారా కూడా పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమ ఖాళీలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి భర్తీ చేయనున్నాయి. 

అంతేకాదు  త్వరలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అస్సాం రైఫిల్స్, CRPF, BSF, CISF, ITBP, SSB వంటి వివిధ పారామిలిటరీ దళాల క్రింద 84,000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించే వీలుంది.    

tags
click me!