CSIO'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

By Sandra Ashok KumarFirst Published Nov 20, 2019, 10:50 AM IST
Highlights

సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేష‌న్‌ (CSIO) లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటంది.   
 

చండీగ‌ఢ్‌లోని CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేష‌న్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పోస్టుల వివరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 27

 సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 01
ఎంబీబీఎస్, ఎండీ (మెడిసిన్) అర్హత    పొంది 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు, వేతనం రూ.1,05,853.

also read SSA jobs: సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాలు...నేటి నుంచి దరఖాస్తులు


సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ గ్రేడ్-3(5): 01
55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత పొంది 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు, జీతం రూ.1,00,136.


సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ గ్రేడ్-3(4): 01
55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత పొంది 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు, జీతం    రూ.84,360.


టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-24
సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత పొంది 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు, జీతం    రూ.47,328 (చండీగఢ్), రూ.52,176 (చెన్నై, ఢిల్లీ)

also read PSC : పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్, కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు.

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.11.2019.

  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 15.12.2019.

click me!