బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ భారతదేశపు ప్రధాన అణు పరిశోధన కేంద్రం.బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) సెక్యూరిటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) సెక్యూరిటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ భారతదేశపు ప్రధాన అణు పరిశోధన కేంద్రం, దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలోని ట్రోంబేలో ఉంది. న్యూక్లియర్ సైన్స్, ఇంజనీరింగ్ , అధునాతన పరిశోధన మరియు అభివృద్ధి కోసం విస్తృతమైన మౌలిక సదుపాయాలతో కూడిన పరిశోధనా కేంద్రం.
also read సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ పోస్టులు
-పోస్టు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్ బీ నాన్ గెజిటెడ్)
-పేస్కేల్: నెలకు రూ.35,400+ ఇతర అలవెన్సులు (లెవల్-6)
-మొత్తం ఖాళీలు: 19 (ఎస్సీ-8, ఎస్టీ-2, ఓబీసీ-3, జనరల్-5, ఈడబ్ల్యూఎస్-1)
-వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32, ఓబీసీలకు 30 ఏండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
-అర్హతలు: కనీసం ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
-పోస్టు: సెక్యూరిటీ గార్డ్
also read PSC:మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ విడుదల
-మొత్తం ఖాళీలు: 73 (ఎస్సీ-15, ఎస్టీ-6, ఓబీసీ-20, జనరల్-26, ఈడబ్ల్యూఎస్-6)
-పేస్కేల్: లెవల్-1 కింద నెలకు రూ.18,000+ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-వయస్సు: 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-శారీరక ప్రమాణాలు: మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులు కనీసం 167 సెం.మీ. ఎత్తుతోపాటు కనీసం 80 సె.మీ ఛాతీ ఉండాలి.
-ఎంపిక విధానం: ఫిజికల్ ఈవెంట్స్, రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 6
-వెబ్‌సైట్: http://www.barc.gov.in