పరీక్షలో ఫెయిల్ అయితే.. జీవితంలో ఓడిపోయినట్లు కాదు.. UPSC 38వ ర్యాంకర్

By telugu news teamFirst Published Oct 9, 2021, 2:03 PM IST
Highlights

వరుణ అగర్వాల్ 2013 సంవత్సరంలో జెస్సీ స్కూల్ నుండి 12 వ తరగతి వరకు చదువుకున్నారు.. దీని తర్వాత ఆమె లా చదువుకోవడానికి పుణె వెళ్లింది. 

ఆమె UPSC లో ర్యాంకు సాధించడం కోసం చాలా కష్టపడింది.  రెండు సార్లు వరస ప్రయత్నాలు చేసినా.. ఆమెకు విజయం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా.. మూడోసారి  మళ్లీ ప్రయత్నించింది. చివరకు ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. మూడో ప్రయత్నంలో ఆమె యూపీఎస్సీలో 38వ ర్యాంకు సాధించింది. ఆమె ఉత్తరఖండ్ లోని రుద్రపూర్ కి చెందిన వరుణ అగర్వాల్.

ఐఏఎస్ కావాలనే కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. మొదటి రెండు సార్లు యూపీఎస్సీలో ఆమె అనుకన్నంత స్థాయి విజయం సాధించలేకపోయింది. కానీ ఎలాంటి నిరాశ చెందకుండా ఆమె తన కల నేరవేర్చుకోవడానికి మరింత కష్టడ్డారు. గతంలో ప్రయత్నించినప్పుడు కేవలం మూడు మార్కులు తగ్గడం వల్ల మెరిట్ దక్కలేదట. అందుకే ఈ సారి ఈ ప్రయత్నం లో ఎలాంటి తప్పులు దొర్లకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరకు 38వ ర్యాంకు సాధించింది.

వరుణ అగర్వాల్ 2013 సంవత్సరంలో జెస్సీ స్కూల్ నుండి 12 వ తరగతి వరకు చదువుకున్నారు.. దీని తర్వాత ఆమె లా చదువుకోవడానికి పుణె వెళ్లింది. 2018 లో ఆమె బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత మాత్రమే ఆమె UPSC కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. అతను తన తాత బన్వారీ లాల్ నుండి IAS కావడానికి ప్రేరణ పొందారు. 

ఆమె 10 వ తరగతి నుండే సివిల్ సర్వీసులో చేరాలని అనుకున్నారు. అతని పాఠశాలలో ఒక సీనియర్ విద్యార్థి విదేశీ సేవలో ఎంపికయ్యాడు. పాఠశాలలో అతని గురించి విన్న తరువాత, వరుణ సివిల్ సర్వీస్ వైపు మొగ్గు చూపింది. అప్పటి నుంచే ఆ దిశగా.. ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన.. నిరాశ చెందడకూడదని.. పరీక్షలో ఫెయిల్ ని.. జీవితంలో ఫెయిల్ గా చూడకూడదని ఆమె చెప్పడం గమనార్హం. అలా చూస్తే.. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్లలేమని ఆమె చెప్పారు. 

తాను యూపీఎస్సీలో మంచి ర్యాంకు సాధించడానికి.. తన కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయం చేశారని.. వారి సపోర్ట్ తో తాను ఈ విజయం సాధించానని ఆమె చెప్పారు.

click me!