UPSC టాప్ సెకండ్ ర్యాంకర్ జాగృతి... పరీక్షకు ఎలా ప్రిపేర్ అయ్యారు..?

By telugu news teamFirst Published Oct 8, 2021, 4:34 PM IST
Highlights

 తొలి ప్రయత్నంలో మంచి మార్కులు సాధించడలేదని తీవ్ర నిరాశకు గురయ్యేదట. కానీ.. అలా అనిపించిన రోజు మరో గంట ఎక్కువగా చదవడానికి ప్రయత్నించేదట. ప్రతికూలతను తట్టుకుని మరింత ఎక్కువ ప్రయత్నం చేశానని ఆమె చెప్పారు.

జాగృతి UPSC 2020 లో సెకండ్ ర్యాంకు సాధించింది. అయితే.. మొదటి ప్రయత్నంలో ఆమె విఫలయ్యారట. రెండో ప్రయత్నంలో మాత్రం తాను అనుకున్నది సాధించారు. ఈ పరీక్ష కు ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె చాలా కష్టపడ్డారట. ముందు ఈ పరీక్షలో ఎలాంటి ప్రయత్నాలు వస్తాయో ముందు అర్థం చేసుకుందట. వాటి కోసం కొత్తగా బుక్ ప్రిపేర్ చేసుకుంది.మాక్ టెస్ట్  ప్రాక్టీస్ చేసేదట. తనకు తానే చాలా సార్లు పరీక్ష పెట్టుకుంటుందట. దాని కోసం ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసేదట.

కోవిడ్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు..?

కోవిడ్ మహమ్మారి సమయాన్ని కూడా ఆమె చుదువు కోసం  కేటాయించారట. ఒకవైపు ఈ కోవిడ్ బారిన తాను, తన కుటుంబం పడే ప్రమాదం ఉందని  చాలా భయపడేదట. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా.. ఒంటరిగా తన చదువును పూర్తి చేశారట. కోవిడ్ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకున్నానని ఆమె చెప్పారు.

ఏదో ఒకటి సాధించాలనే తపన తనకు చిన్నతనం నుంచే ఉందని జాగృతి చెప్పింది. అయితే.. ఉద్యోగం చేస్తానని ఆమె అనుకునేదట. ఉద్యోగం చేయాలని చిన్నప్పటి నుంచి ఉండేదట. అయితే.. కరోనా సమయంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందట. ఆ సమయంలో ఆదాయం తగ్గి ఇబ్బందిపడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. ఉద్యోగం వదిలేయకుండా ఉండాల్సిందేనని బాధపడేదట. కానీ.. చివరకు తాను అనుకున్నది సాధించగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

జులై 2019 నుంచి సెప్టెంబర్ 2021 వరకు దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం కొన్ని సార్లు కోర్సు చేసినా.. తొలి ప్రయత్నంలో మంచి మార్కులు సాధించడలేదని తీవ్ర నిరాశకు గురయ్యేదట. కానీ.. అలా అనిపించిన రోజు మరో గంట ఎక్కువగా చదవడానికి ప్రయత్నించేదట. ప్రతికూలతను తట్టుకుని మరింత ఎక్కువ ప్రయత్నం చేశానని ఆమె చెప్పారు.

కాగా..తన విజయంలో ఫూర్తి క్రెడిట్ జాగృతి తన కుటుంబానికి ఇచ్చేశారు. తల్లి విజయ, తండ్రి సురేష్ చంద్ర, స్నేహితులు తన కోసం ఎంతో కష్టపడ్డారని ఆమె చెప్పారు. ఈ యూపీఎస్సీ పరీక్ష కోసం  దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇంట్లో టీవీ లేదని ఆమె  చెప్పారు. టీవీ ఉంటే.. దానిని చూస్తే సమయం వృథా చేస్తాననే భయంతో  టీవీ కూడా తీసేశామని ఆమె చెప్పారు. 

click me!