బిటెక్ చేసిన వారికి హైదరాబాద్ బి‌డి‌ఎల్ లో భారీగా ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకొండో వెంటనే..

By S Ashok Kumar  |  First Published Mar 12, 2021, 5:26 PM IST

హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బి‌డి‌ఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 


మీరు బిటెక్ పూర్తి చేశారా... ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బి‌డి‌ఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌  https://bdl-india.in/లో చూడవచ్చు.

Latest Videos

undefined


మొత్తం ఖాళీలు: 70
మెకానికల్‌ - 24, ఎలక్ట్రికల్‌ - 1, ఎలక్ట్రానిక్స్‌ - 22, కంప్యూట్‌ - 1, సివిల్‌- 3, ఎస్‌ఏపీ ఈఆర్‌పీ/నెట్‌వర్క్‌ - 4, హెచ్‌ఆర్‌ - 7,ఫైనాన్స్‌ - 4, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ - 4

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి తప్పనిసరిగా బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/బీఎస్సీ/ఎంబీఏ/పీజీడిప్లొమా/ఎం‌ఎస్‌డబల్యూ ఉత్తీర్ణులై ఉండాలి.

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...
వయసు: అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
జీతాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 33 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36 వేల నుంచి రూ.39 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపికలు  ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12 మార్చి 2021
దరఖాస్తులకు చివరితేది: 31 మార్చి 2021

దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://bdl-india.in/ వెబ్ సైట్‌లో మార్చి 31లోగా అప్లయ్‌ చేసుకోవాలి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే hrcorp-careers@bdl-india.in కు ఈ-మెయిల్ చేయాలని ప్రకటనలో సూచించారు.

click me!