బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

By S Ashok KumarFirst Published Apr 10, 2021, 7:11 PM IST
Highlights

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 511 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
 

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్ అందించింది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బి‌ఓ‌బి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 29లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు మరింత సమాచారం లేదా పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌  https://www.bankofbaroda.in/ చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టులు: 511

సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్-‌ 407

ఈ-రిలేషన్‌షిప్‌ మేనేజర్లు- 50

టెర్రిటరీ హెడ్- 44

గ్రూప్‌ హెడ్స్-‌ 6

ప్రాడక్ట్‌ హెడ్స్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌)- 1

ఆపరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్-‌ 1

డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్-‌ 1

also read 

ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్-‌ 1

అర్హత: పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు నిర్ణయించారు. అయితే డిగ్రీ లేదా తత్సమాన అర్హత తప్పనిసరి ఉండాలి. ఈ వివరాల పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

వయసు: అభ్యర్థులు 23 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్‌సి, ఎస్‌టి, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100

దరఖాస్తులు ప్రారంభం: 9 ఏప్రిల్‌  2021

దరఖాస్తులకు చివరి తేదీ: 29 ఏప్రిల్‌ 2021

వేతనం: వివిధ అంశాలను బట్టి నిర్ణయిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌:https://www.bankofbaroda.in/

click me!