కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్‌ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్‌సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు.
కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్‌ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్‌సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు.
ఇందుకు కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వీటిలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ లాంటి వివిధ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 15 డిసెంబర్ 202.
undefined
ఈ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://canarabank.com/లో చూడవచ్చు.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీతో పాటు కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100గా నిర్ణయించారు.
also read
దరఖాస్తు చేసుకునే విధానం: మొదట https://canarabank.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Careers అనే లింక్ పైన క్లిక్ చేయాలి. తరువాత Recruitment పైన క్లిక్ చేస్తే Recruitment Project – 2/2020 – Specialist Officers and Special Recruitment Drive under ST Category నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ సర్టిఫికెట్స్ ఆధారంగా ఎంటర్ చేయాలి. తరువాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకొవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 220
బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్- 4, ఎక్స్‌ట్రాక్ట్, ట్రాన్స్‌ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్- 5, బీఐ స్పెషలిస్ట్- 5, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్- 5, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-10, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 12, డెవలపర్ లేదా ప్రోగ్రామర్- 25, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 21, ఎస్ఓసీ అనలిస్ట్- 4, మేనేజర్స్ లా- 43, కాస్ట్ అకౌంటెంట్- 1, ఛార్టర్డ్ అకౌంటెంట్- 20, మేనేజర్ ఫైనాన్స్- 21, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 4, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్- 2, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్- 2, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్- 2, OFSAA అడ్మినిస్ట్రేటర్- 2, OFSS టెక్నో ఫంక్షనల్- 5, బేస్ 24 అడ్మినిస్ట్రేటర్- 2, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్- 4, మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్- 5, డేటా అనలిస్ట్- 2, మేనేజర్- 13, సీనియర్ మేనేజర్- 1 పోస్టులున్నాయి.