రాతపరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు‌.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.

By S Ashok KumarFirst Published Dec 9, 2020, 4:03 PM IST
Highlights

 బ్యాంక్ ఆఫ్ ఇండియా (బి‌ఓ‌ఐ) ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీస‌ర్ పోస్టులు ఊన్నాయి. 

భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంకు, ముంబ‌యి ప్ర‌ధాన‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (బి‌ఓ‌ఐ) ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీస‌ర్ పోస్టులు ఊన్నాయి. ఈ పోస్టులను గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

21 డిసెంబర్‌ 2020 దరఖాస్తుకు చేసుకోవడానికి  చివరి తేది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://bankofindia.co.in/ చూడొచ్చు.

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య: 21
సెక్యూరిటీ ఆఫీస‌ర్‌- 20
ఫైర్ ఆఫీస‌ర్‌- 01

1) సెక్యూరిటీ ఆఫీస‌ర్‌
అర్హ‌త‌: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్‌‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌లో క‌నీసం ఐదేళ్ల  పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.

also read  

వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్క‌ష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

2) ఫైర్ ఆఫీస‌ర్‌
అర్హ‌త‌: నాగ్‌పుర్‌లోని నేష‌న‌ల్ ఫైర్ స‌ర్వీస్ కాలేజ్ నుంచి బీఈ(ఫైర్ ఇంజినీరింగ్‌)/ డివిజిన‌ల్ ఆఫీస‌ర్ కోర్సు/ స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి. అలాగే క‌నీసం మూడు నెల‌ల కంప్యూట‌ర్ కోర్సు‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక చేసే విధానం: గ్రూప్‌ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21 డిసెంబర్‌ 2020.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌:https://bankofindia.co.in/ సందర్శించండి.

click me!