తెలంగాణలో ఎస్‌బి‌ఐ బ్యాంక్‌ ఉద్యోగాలు‌.. కొద్దిరోజులు మాత్రమే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok KumarFirst Published Dec 7, 2020, 5:46 PM IST
Highlights

ఎస్‌బిఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 10, 2020 తో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీ, తెలంగాణలో 1080 పోస్టులున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 8500 మంది అప్రెంటిస్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎస్‌బిఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 10, 2020 తో ముగుస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీ, తెలంగాణలో 1080 పోస్టులున్నాయి.

ఆసక్తిగల, అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 10న లేదా అంతకుముందులోగా అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2021లో రిక్రూట్‌మెంట్ పరీక్షను బ్యాంక్ నిర్వహించనుంది.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ నుండి 31  అక్టోబర్ 2020లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

డిసెంబర్‌ 10 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

also read 

వయో పరిమితి: 31.10.2020 నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు అంటే అభ్యర్థులు 01.11.1992 తరువాత 31/10/2000 కంటే ముందు జన్మించి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / పిడబ్ల్యుడి అభ్యర్థులకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధిక వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.    

జనరల్/ఓబిసి/ఇడబ్ల్యుఎస్ వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి స్టైపెండ్ మొదటి ఏడాది నెలకు రూ.15,000, రెండో ఏడాది నెలకు రూ.16,500, మూడో ఏడాది నెలకు రూ.19,000 లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాళీలు మొత్తం 620
నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43, శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47.


తెలంగాణలో ఉన్న ఖాళీలు మొత్తం 460
మహాబూబాబాద్ -12, మహబూబ్‌నగర్ -33, ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మల్కాజ్‌గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్‌కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11, నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16 పోస్టులున్నాయి.

click me!