Ukraine Russia Crisis ఆరు రోజుల్లో ఆరువేల మంది రష్యన్ సైనికులు మృతి: జెలెన్ స్కీ

Published : Mar 02, 2022, 04:23 PM ISTUpdated : Mar 02, 2022, 04:25 PM IST
Ukraine Russia Crisis  ఆరు రోజుల్లో ఆరువేల మంది రష్యన్ సైనికులు మృతి: జెలెన్ స్కీ

సారాంశం

ఆరు రోజులుగా తమ దేశం సైన్యం చేతిలో ఆరు వేల మంది రష్యన్ ఆర్మీ మరణించారని  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ప్కీ ప్రకటించారు.

కీవ్: ఆరు రోజులుగా తమ సైనికుల చేతిలో ఆరు వేల మంది Russia ఆర్మీ మరణించినట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు 
Zelensky ప్రకటించారు.Ukraine లో ని దక్షిణ నగరమైన ఖేర్సన్ ను రష్యా తమ ఆధీనంలోకి తీసుకొన్న సమయంలో జెలెన్స్ స్కీ ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఖార్కివ్ నగరంపై రష్యా దాడులకు దిగుతుంది.కీవ్ నగరానికి రష్యా దళాలు వస్తున్నాయని  కీవ్ నగర మేయర్ విటా క్లిట్కో చెప్పారు.  ఖార్కివ్ నగరంపై రష్యా క్షిపణులతో దాడులకు దిగుతుంది.

ఉక్రెయిన్ పై గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుండి రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగిస్తుంది.  NATOలో సభ్యత్వంపై ఉక్రెయిన్ కు స్పష్టమైన హామీ లభించలేదు. కానీ పశ్చిమ దేశాల నుండి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. తమ దేశంపై రష్యా దాడులను నిలిపివేయడానికి వీలుగా నాటో దేశాలు రష్యా పై నో ఫ్లై జోన్ ను విధించాలని కోరుతున్నాయి.  గత నెల 28వ తేదీన తొలి విడత చర్చల్లో రెండు దేశాలు తమ వాదలను విన్పించారు. అయితే రెండో విడత చర్చల్లో ఏ రకమైన పరిస్థితి ఉంటుందనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. 

ఉక్రెయిన్ పై రష్యా దాడులను నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఈయూ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా రష్యా తీరును తప్పు బడుతున్నాయి. ఉక్రెయిన్ కు పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యా విమానాలతో పాటు బ్యాంకు లావాదేవీలపై కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. 

ఉక్రెయిన్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన దాడుల్లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని Kviv ను అత్యవసరంగా రైళ్లలో లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా విడిచిపెట్టాలని భారతీయుల‌కు  ఎంబసీ కోరింది. ఇదే త‌రుణంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. కీవ్‌లో ప్ర‌స్తుతం భారతీయులెవ‌రూ లేరనీ  ఎంబ‌సీని భార‌త దౌత్య సిబ్బందిని మ‌రోచోటికి త‌ర‌లించారని విదేశాంగ‌శాఖ  ప్ర‌క‌టించింది.

దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై ఆ దేశపు సైన్యం పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను తరలిస్తోంది.  రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది.

కనీసం తమ దేశ ప్రజలపై బాంబు దాడులను ఆపడం అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  కోరారు. బాంబు దాడులను నిలిపివేయకుండా చర్చల్లో కూర్చోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకుు రెండు అంతర్జాతీయ మీడియా సంస్థలకు జెలెన్ స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. గత నెల 28వ తేదీన రష్యా, ఉక్రెయిన్ మధ్య తొలి దశ చర్యలు సాగాయి. ఈ చర్చల్లో కొంత పురోగతి ఉందని సమాచారం. రెండో విడత చర్చలు ఇవాళ జరగనున్నాయి

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే