మీ మాజీ పై పగ తీర్చుకోవాలా..? బంపర్ ఆఫర్ ఇచ్చిన జూ..!

Published : Jan 20, 2023, 09:36 AM IST
మీ మాజీ పై పగ తీర్చుకోవాలా..? బంపర్ ఆఫర్ ఇచ్చిన జూ..!

సారాంశం

అలాంటి వారి కోసం టొరంటో లోని ఓ జూ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది. మీ మాజీ ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలిపై మీ కోపాన్ని మీరు తీర్చుకోవడానికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది

ప్రేమికుల రోజున..  ప్రేమికులంతా ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. ఆ రోజుని లవర్స్ చాలా స్పెషల్ గా భావిస్తారు. ఆ రోజుని మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలా అని ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు.  ప్రేమలో ఉన్నవారు. కానీ...బ్రేకప్ అయినవారి పరిస్థితి ఏంటి..? తమ మాజీలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. తమను వదిలేసి వెళ్లినందుకు తమ మాజీలను తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం టొరంటో లోని ఓ జూ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది. మీ మాజీ ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలిపై మీ కోపాన్ని మీరు తీర్చుకోవడానికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారి జూలోని బొద్దింక కు మీరు మీ మాజీ పేరు పెట్టుకొని.. వారిపై ఉన్న కోపాన్ని వీటీ ద్వారా తీర్చుకోవచ్చని ప్రకటించింది.

 


అందుకోసం మీరు జూ యాజమాన్యానికి  కేవలం $25 (రూ. 1507) చెల్లించాల్సి ఉంటుంది.  “గులాబీలు ఎర్రగా ఉంటాయి; వైలెట్లు నీలం రంగులో ఉంటాయి- మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా వారి గౌరవార్థం బొద్దింకకు పేరు పెట్టడం ద్వారా పగ తీర్చుకోండి.” అంటూ.. టొరంటో జూ వైల్డ్‌లైఫ్ కన్సర్వెన్సీ ట్విట్టర్ లో పోస్టు చేయడం విశేషం.


"పేరు పెట్టే అవకాశాలు మాజీలకు మాత్రమే పరిమితం కాదు - మీ బాస్, మాజీ స్నేహితుడు, బంధువు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరి పేరు అయినా ఆ బొద్దింకకు పెట్టుకోవచ్చు. వారు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే