ఐరాస హెడ్ ఆఫీస్‌లో యోగాడే : కదిలొచ్చిన ప్రపంచం, మోడీతో కలిసి యోగాసనాలు.. గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం

Siva Kodati |  
Published : Jun 21, 2023, 07:25 PM IST
ఐరాస హెడ్ ఆఫీస్‌లో యోగాడే : కదిలొచ్చిన ప్రపంచం, మోడీతో కలిసి యోగాసనాలు..  గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం

సారాంశం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం కదిలివచ్చారు. ఈ భారీ ఈవెంట్‌ గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశాలకు చెందిన వారితో కలిసి మోడీ యోగాసనాలు వేశారు. అంతేకాదు వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. యోగాకు ఎలాంటి పేటెంట్, రాయల్టీ లేవన్నారు. యోగా డే జరపాలనే భారత్ ప్రతిపాదనకు అన్ని దేశాలు అండగా నిలిచాయని మోడీ గుర్తుచేశారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యోగా ప్రాచుర్యంలో వుందని.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందన్నారు. యోగా అంటే అందరినీ కలిపేదని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాదిని మిల్లెట్ ఇయర్‌గా భారతదేశం ప్రతిపాదించిందని.. దీనిని ప్రపంచం ఆమోదించిందని చెప్పారు. 

ALso Read: WATCH Live | అంతర్జాతీయ యోగా దినోత్సవం : ఆసనాలు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ

ఇకపోతే.. ఐక్యరాజ్యసమితి 2014లో ఒక తీర్మానం ద్వారా జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించారు. నేటితో ఈ దినోత్సవానికి ఆమోదం లభించి తొమ్మిది సంవత్సరాలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. ఆమోదించిన కామన్ యోగా ప్రోటోకాల్ ను అనుసరించి పూర్తి భాగస్వామ్యంతో ఐడీవైని పాటించాలని మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని సంస్థలను ఆదేశించింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?