మరణశిక్షను రద్దు చేయాలని కోరిన కేరళ నర్సు.. తిరస్కరించిన యెమెన్ కోర్టు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

Published : Mar 07, 2022, 03:41 PM IST
మరణశిక్షను రద్దు చేయాలని కోరిన కేరళ నర్సు.. తిరస్కరించిన యెమెన్ కోర్టు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

సారాంశం

యెమెన్ జాతీయుడిని  హత్య చేసిన కేసులో తనకు విధించిన మరణశిక్షను తగ్గించాలని కేరళ నర్సు నిమిషా ప్రియా దాఖలు చేసిన అప్పీల్‌ను అక్కడి కోర్టు తిరస్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆమె మరణ శిక్షను రద్దు చేసేందుకు అంగీకరించలేదు. 

యెమెన్ జాతీయుడిని  హత్య చేసిన కేసులో తనకు విధించిన మరణశిక్షను తగ్గించాలని కేరళ నర్సు నిమిషా ప్రియా దాఖలు చేసిన అప్పీల్‌ను అక్కడి కోర్టు తిరస్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆమె మరణ శిక్షను రద్దు చేసేందుకు అంగీకరించలేదు. వివరాలు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా.. యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసి.. అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా.. 2018లో యెమెన్‌లోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధిచింది.

అయితే నిమిషా తనకు సరైన న్యాయ సహాయం అందలేదని.. తలాల్ అబ్దో తనను శారీరకంగా హింసించాడని పేర్కొంటూ ఒక అభ్యర్థనను సమర్పించింది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన లైసెన్స్ ప్రాసెస్ చేయడానికి.. యెమెన్ జాతీయుడి సహాయం కావడంతో... 2014లో యెమెన్‌లో క్లినిక్‌ని ఏర్పాటు చేయడాలని నిమిషా.. తలాల్ సహాయం కోరింది. కానీ ఆమె మరో యెమెన్ జాతీయుడి సహాయంతో వ్యాపారం ప్రారంభించింది. అయితే ఆమె ఆదాయాన్ని సంపాదించడం మొదలైన తర్వాత.. పరిస్థితులు మారిపోయాయి. 

నిమిషా వ్యాపారంలో తలాల్ జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. ఆదాయంలో తనకు షేర్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నకిలీ పత్రాలను సృష్టించి.. నిమిషా తన భార్య అని చెప్పుకొవడం ప్రారంభించాడు. ఆమెను బెదిరించడంతో పాటు... శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో నిమిషా పోలీసులకు తలాల్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తలాల్‌ను అరెస్ట్ చేశారు.. కానీ తర్వాత అతడిని విడిచిపెట్టారు. 2016లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. తలాల్.. నిమిషా పాస్‌పోర్టును అతని వద్ద ఉంచుకున్నాడు. తలాల్‌ నుంచి ఇబ్బందులు మరింతగా పెరిగిన నేపథ్యంలో అతడిని హత్య చేయాలని నిమిషా ప్లాన్ వేసింది. ఇందుకు నిమిషా తనతో పాటే పనిచేసే నర్సు హనన్ సహాయం కోరింది. 

ఇద్దరు కలిసి అధిక మోతాదులో తలాల్‌కు మత్తు పదార్థాలను ఇంజెక్ట్ చేసి.. ముక్కలుగా నరికి మృతదేహాన్ని పాలిథిన్ సంచిలోప్యాక్ చేశారు. అనంతరం అపార్ట్‌మెంట్‌లోని వాటర్ ట్యాంకులో పడేశారు. తర్వాత నిమిషా అక్కడి నుంచి పారిపోయింది. 200 కి.మీ దూరంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. తలాల్ హత్య జరిగిన కొంత కాలానికే పోలీసులు నిమిషాను హత్య చేశారు. దీంతో ట్రయల్ కోర్టు నిమిషాకు మరణ శిక్ష విధించింది. ఈ హత్యకేసులో నిమిషాకు సాయం చేసిన హనన్ ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తోంది.

ప్రస్తుతం జైలులోనే శిక్షను అనుభవిస్తున్న నిమిషా.. మరణశిక్షను రద్దుచేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను అప్పీల్ కోర్టు తిరస్కరించింది. తీర్పును సుప్రీం కోర్టు పరిశీలనకు పంపినప్పటికీ.. అప్పీల్ కోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వెనక్కి తీసుకునే అవకాశం లేదు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే