గబ్బిలాల్లో మరో కొత్త వైరస్ ‘నియో కోవ్’.. ఇది సోకితే అంతే.. ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి...

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 12:41 PM IST
Highlights

దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల Batల్లో ఈ ‘నియో కోవ్’ వైరస్ బయటపడింది. ఇది కూడా Coronavirusయే అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు (కొవిడ్19 (సార్స్-కోవ్-2)తొలిసారి వెలుగు చూసింది ఇక్కడే) పరిశోధనలు జరపగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది. 

కరోనా వైరస్ కొత్త కొత్త మ్యుటెంట్లు మనుషుల్ని ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఒకదాన్నుండి బయటపడ్డామని సంతోషించే లోపే మరో కొత్త వేరియంట్ దాడి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓవైపు సార్స్ -కోవ్-2 (కరోనా మహమ్మారి)లో  కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ... మరో కొత్త వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. South Africaలో బయటపడిన ‘నియో కోవ్ (NeoCoV)’ అనే కొత్త రకం వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు high death rate కూడా అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు Wuhan శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురి చేస్తోంది.

దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల Batల్లో ఈ ‘నియో కోవ్’ వైరస్ బయటపడింది. ఇది కూడా Coronavirusయే అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు (కొవిడ్19 (సార్స్-కోవ్-2)తొలిసారి వెలుగు చూసింది ఇక్కడే) పరిశోధనలు జరపగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతున్న వైరస్ గా గుర్తించారు.

మనుషులకు సోకే ప్రమాదం..
అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదముందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘ నియో కోవ్’ వైరస్ కు.. గబ్బిలాల్లోని యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2) ప్రభావంతంగా వాడుకుంటుంది. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వుహాన్ యూనివర్సిటీ,  బయో ఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు.

వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువే..
కోవిడ్ 19తో పోలిస్తే ‘నియో కోవ్’ వైరస్ కాస్త భిన్నమైనదే కాగా, ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీ బాడీలు, covid 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చు అని చెబుతున్నారు. అంతేగాక 2012, 2015లో మధ్య ప్రాచ్య దేశాల్లో విజృంభించిన మెర్స్-కోవ్ మాదిరిగా ‘నియో కోవ్’తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాపాయం తప్పదని అన్నారు. ఇక సార్స్-కోవ్-2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

రష్యా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
ఈ కథనం విక్టర్ వైరస్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ నిపుణులు స్పందించారు. ‘నియో కోవ్’ పై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన ఫలితాలు తమకు కూడా తెలుసన్నారు. అయితే ప్రస్తుతం ఇది జంతువులలో మాత్రమే ఉన్నందున దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేదు అన్నారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

click me!