129మంది పిల్లలకు తండ్రి.. 150మంది అయ్యేదాకా ఆపడట..

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 9:21 AM IST
Highlights

యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (66 సంవత్సరాలు) వీర్య దాతగా మారడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిదిమంది త్వరలో పుట్టబోతున్నారు.  తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటినుంచి వీర్యం దానం చేస్తున్నట్లు తెలిపారు. వీర్యదానం చేయడానికి డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించారు. 

బ్రిటన్ : ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కోరుకుంటున్నారు. అయిదారుగురు పిల్లలు ఉన్నవారు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 మంది childrenకు తండ్రి అయ్యాడు. అంతటితో ఆగాడా? అంటే లేదు.. 150మంది పిల్లలు కావాలంట.. అప్పటికి కానీ తాను పిల్లలకు father కావడం ఆపను అని చెబుతున్నాడు. మరి ఇది ఎలా సాధ్యం అయింది అంటారా?... Semen donation చేయడం ద్వారా.  

పాశ్చాత్య దేశాల్లో  వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదు. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (66 సంవత్సరాలు) sperm donorగా మారడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిదిమంది త్వరలో పుట్టబోతున్నారు.  తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటినుంచి వీర్యం దానం చేస్తున్నట్లు తెలిపారు.

sperm donate చేయడానికి డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువ మందికి వీర్యదానం చేసిన వ్యక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరి కొన్నేళ్లపాటు వీర్య దానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్య దానం చేయనని క్లైవ్ పేర్కొన్నాడు.  అయితే, క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్లో స్పెర్మ్ డోనర్ గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా face book ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయి ఉచితంగా వీర్య దానం చేస్తున్నాడు. బ్రిటన్లో చాలా క్లినిక్ లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు.

 ఒకరికి  ఆనందాన్ని ఇవ్వడం,  వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని  క్లైవ్ చెబుతున్నాడు.  10 సంవత్సరాల క్రితం వార్తా పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తర్వాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు.

అయితే, యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ క్లైవ్ కు హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా బ్రిటన్లో స్మెర్మ్ డొనేషన్చ కొనుగోలు చేయడం లైసెన్స్ పొందిన క్లినిక్ ల ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వీటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

ఇలాంటి ఘటన ఒకటి నిరుడు ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. తండ్రి చేసిన ఓ పని కొడుకుకి అనవసర తలనొప్పలు తెచ్చిపెట్టింది.  గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుక్కోవడానికే భయపడేలా చేసింది. దీంతో డేటింగ్ యాప్ ట్రై చేయాలంటేనే టెన్షన్ పడిపోతున్నాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. 

ఇంతకీ విషయం ఏంటంటే.. యూఎస్ లోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24 యేళ్ల జేవ్ ఫోర్స్ ది ఓ విచిత్ర సమస్య. జేవ్ కు డేటింగ్ యాప్ అంటే భయం పట్టుకుంది. దీనికి కారణం అతని తండ్రే. ఎలాగంటే.. జేవ్ తండ్రి వయసులో ఉన్నప్పుడు 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడట. దీంతో వారి రాష్ట్రంలోని అతడి వీర్యంతో సంతానం పొందినవారు అనేకమంది ఉన్నారు.  

వీరంతా జేవ్ కి సమవయస్కేలు. అయితే ఏంటీ అంటారా?.. వాళ్లు వరసకు జేవ్ కి అక్కో, చెల్లో అవుతారు కదా.. అదీ సమస్య. ఇప్పుడు వారు కూడా డేటింగ్ యాప్ వాడుతుండొచ్చు. ఒకవేళ తాను డేటింగ్ యాప్ లో తన తండ్రి వీర్యదానంతో పుట్టిన అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలా అనే భయమే అతన్ని వేధిస్తోంది. 

అలాంటి అమ్మాయిలకు తల్లులు వేరైనా జన్యుపరంగా తండ్రి జేవ్ తండ్రే అవుతాడు కాబట్టి.. జేవ్ కు వారంతా సోదరీమణులే అవుతారు. ఇప్పుడీ సమస్యే జేవ్ ఎవర్నీ ప్రేమించకుండా చేస్తోంది. అంతేకాదు జేవ్ ఇప్పటికే ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడట. అందులో ఒకరు తను చదువుకున్న స్కూల్ లోనే చదువుకున్నాడట. ఈ మధ్యే ఆ విషయం తెలిసి జేవ్ ఆశ్చర్యపోయాడు. 

అంతేకాదు.. తన తండ్రి వీర్యంతో జన్మించిన ఇద్దరు సోదరులు ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న అపార్ట్మెంట్లలో ఉంటున్నారట. ఇలా ఎవరిని కలిసినా తన సోదరులు, సోదరీ మణులు అవుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. 
 

click me!