ఓ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓ మహిళ ట్రైన్ మీదికి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వీడియో అది. ఆ మహిళ బంగ్లాదేశ్‌లోని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది.
బంగ్లాదేశ్ : రద్దీగా ఉండే రైలు పైకప్పుపైకి ఎక్కేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిన్న వీడియో క్లిప్ ను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. దీనికి "బంగ్లాదేశ్‌లోని రైల్వే స్టేషన్‌లో ఓ రోజు" అని ఈ పోస్ట్‌కు హెడ్డింగ్ పెట్టారు. ఈ వీడియోలో ఓ గుర్తు తెలియని మహిళ.. బంగ్లాదేశ్‌లోని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అయితే, బహుశా ఆమెకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సీటు దొరకలేదు. ట్రైన్ ఏమో కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే ట్రైన్ మీద చాలామంది కూర్చుని ఉన్నారు. దీంతో ఆ మహిళ సాహసం చేసింది. దీంతో ఆ మహిళ తాను ఎలాగైనా ట్రైన్ మిస్ కావద్దని.. ట్రైన్ మీదికి ఎక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తుంది.
ఈ ప్రయత్నంలో భాగంగా ఆమె ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కిటికీ అంచు మీద నిలబడి పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటికే పైన కూర్చున్న ఇతరులు ఆమెను పైకి లాగడానికి ప్రయత్నించారు. అయితే ఎంతగా ప్రయత్నం చేసినా.. ఎంతమంది ప్రయత్నించినా.. మహిళ ట్రైన్ పైకి ఎక్కడం విఫలమైంది. వీడియో చివరలో, ఒక రైల్వే పోలీసు జవాన్ ఆమెను రైలు పైకి ఎక్కకుండా ఆపడానికి కర్రతో అక్కడికి రావడం కనిపిస్తుంది.
undefined
రూ.30వేల కోసం.. మాజీ లవర్ ను కిడ్నాప్ చేయించిన ప్రియురాలు.. ఎక్కడంటే..
ఈ షార్ట్ వీడియో ఆగస్టు 10న పోస్ట్ చేయబడింది. దీనిమీద అనేక కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అధిక జనాభా వల్లే ఈ పరిస్థితి అని ఆరోపించారు. మరికొందరుఈ వీడియోను సరదాగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇంకొందరు "ఇంత మంది ఎలాంటివీ పట్టుకోకుండా పైకప్పు మీద ఎలా కూర్చుంటారు?" అనే సందేమాన్ని వ్యక్తం చేశారు. ఇంకొకరు ఇది పెరుగుతున్న జనాభా సమస్య అంటే.. మరొకరు ఇలా ప్రయాణించడం ఎలా అనుమతించారు.. అని ప్రశ్నించారు. ఇది క్రిమినల్ నేరం కాదా? అని ప్రశ్నించారు. అయితే, ఈ వీడియో ఇప్పటివరకు ఈ వీడియోకు 12 మిలియన్లకు పైగా వ్యూస్, 360,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.