అందం కోసం సర్జరీలు..భర్త కోసమే అంటూ..!

Published : Aug 05, 2023, 10:23 AM IST
అందం కోసం సర్జరీలు..భర్త కోసమే అంటూ..!

సారాంశం

నిజానికి భార్యలు, అంతంత ఖర్చుపెడుతూ ఉంటే, భర్త ల గుండె పగిలిపోతుంది. కానీ,  ఆమె భర్త ఆమెను చూసి మురిసిపోతున్నాడు. ఆమె అలా సర్జరీలు చేయించుకోవడానికి భర్త అండగా నిలుస్తుండటం విశేషం.

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఇది చాలా కామన్. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఏకంగా ఓ మహిళ అందం కోసం లక్షలు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకుంటోంది. అయితే, తాను ఆ అందం కోసం తాపత్రయపడేది కేవలం తన భర్త కోసమే అని ఆమె చెప్పడం విశేషం.

నిజానికి భార్యలు, అంతంత ఖర్చుపెడుతూ ఉంటే, భర్త ల గుండె పగిలిపోతుంది. కానీ,  ఆమె భర్త ఆమెను చూసి మురిసిపోతున్నాడు. ఆమె అలా సర్జరీలు చేయించుకోవడానికి భర్త అండగా నిలుస్తుండటం విశేషం. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లండన్‌కు చెందిన లీలా గ్రిఫిన్ అనే 29 ఏళ్ల మహిళ.. 53 ఏళ్ల గ్రిఫిన్ అనే మిలియనీర్‌ను పెళ్లి చేసుకుంది. తనకంటే 25 ఏళ్లు పెద్దవాడైన భర్తను నిత్యం సంతోషంగా ఉంచాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందుకోసం రోజూ తనకు అందంగా కనిపించాలని అనుకుంది. కేవలం మేకప్ తో కనిపించే అందంగా అనిపిస్తే సరిపోదని,  తన శరీరం మొత్తం అందంగా కనిపించాలని అనుకుంది. అంతే, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది.

ఇందుకోసం సుమారు $9,500 ( భారత కరెన్సీలో  సుమారు రూ. 7.8 లక్షలు) ఖర్చు చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. తన భర్తకు మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మరిన్ని శస్త్ర చికిత్సలు చేయించుకుంది. రూ.82లక్షలతో త్వరలో మరో చికిత్స చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. భార్య ఇలా చికిత్స చేయించుకోవడంపై భర్త సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా చికిత్స అనంతరం ఆమెకు కావాల్సిన అన్ని పనులను ఆమె భర్త జాగ్రత్తగా చూసుకోవడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..
USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్