పబ్ జీ ఆడనివ్వడం లేదని.. భర్తకు మహిళ విడాకులు

Published : May 17, 2019, 04:21 PM IST
పబ్ జీ ఆడనివ్వడం లేదని.. భర్తకు మహిళ విడాకులు

సారాంశం

భర్త చిత్ర హింసలు పెడుతున్నాడనో, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడో... వరకట్నం కోసం వేధిస్తున్నాడనో.. ఇలా చాలా రకాల కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్నారు.


భర్త చిత్ర హింసలు పెడుతున్నాడనో, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడో... వరకట్నం కోసం వేధిస్తున్నాడనో.. ఇలా చాలా రకాల కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్నారు. కానీ... కేవలం పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదని ఎవరైనా భర్తకి విడాకులు ఇస్తారా..? ఓ మహిళ ఇచ్చింది. ఈ వింత  సంఘటన అరబ్ దేశంలో చోటుచేసుకుంది.

భర్త తనను పబ్‌జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ సదరు మహిళ విడాకులు కోరింది. అంతేగాక తన ఇష్టాన్ని భర్త విలువ ఇవ్వడం లేదని, అతడి ఇష్టం ప్రకారమే నడుచుకోవాలని చెబుతున్నట్లు సదరు మహిళ పేర్కొంది. ఈ మేరకు అజ్మన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో భర్తను విచారించారు. అయితే, తాను అలా ఏమీ చెప్పలేదని ఎప్పుడు గేమ్‌లో మునిగిపోకుండా కొంత సమయం కటుంబ సభ్యులతో కూడా గడపాలని చెప్పినట్లు తెలిపాడు.

 ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రత్నించలేదన్నాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడాలని మాత్రమే చెప్పానని, చిన్న పిల్లల గేమ్ ఆడుతూ ఉండడం అతిథుల ముందు బాగోదని సముదాయించినట్టు పేర్కొన్నాడు. అయితే, ఇంత చిన్న కారణానికి తన భార్య విడాకుల వరకు వెళ్తుందని మాత్రం అనుకోలేదని వాపోయాడు. 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి