డాక్టర్ పిసినారితనం: 400 మందికి హెచ్‌ఐవీ, చిన్నారులే అధికం

By Siva KodatiFirst Published May 17, 2019, 10:09 AM IST
Highlights

ఒక వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా సుమారు 400 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. 

ఒక వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా సుమారు 400 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌ లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ముజఫర్ గంగర్ ఒకే సిరంజిని పలువురికి వాడటంతో దాదాపు 400 మందికి హెచ్ఐవీ సోకింది.

వీరిలో అత్యధికులు చిన్నారులే.. మరికొంత మందికి ప్రస్తుతం అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటతో.. నివేదిక వచ్చిన సమయంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అ

భం శుభం తెలియని తమ చిన్నారులకు ఈ మహామ్మరి సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు సాధారణ జీవితాన్ని ఎలా గడుపుతారు.. సమాజం వారిని ఎలా చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ పిల్లలను ఆదుకోవాలని వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ పిల్లలకు ఈ పరిస్థితి కల్పించిన వైద్యుడికి మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

హెచ్‌ఐవీ కేసుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది.. ఒక్క 2017లోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యులు, పేదరికం కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

డబ్బును ఆదా చేయవచ్చుననే దురుద్దేశంతో అనేక మంది వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు. కాగా ఇంతటి దారుణానికి కారణమైన వైద్యుడు కూడా ఎయిడ్స్ బాధితుడు కావడం గమనార్హం.

ప్రస్తుతం అతను రటోడెరోకు సమీపంలోని జైల్లో ఉన్నాడు. దీనిపై వైద్యుడు మాట్లాడుతూ.. నాకు హెచ్ఐవీ ఉన్న సంగతి తెలియదని.. కావాలనే తాను కలుషిత సిరంజి వాడానని చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమన్నాడు. 

click me!