18ఏళ్లు గా ఒక్కసారి కూడా ఉతకకుండా జీన్స్ వాడిన మహిళ..!

Published : May 03, 2023, 09:38 AM IST
18ఏళ్లు గా ఒక్కసారి కూడా ఉతకకుండా జీన్స్ వాడిన మహిళ..!

సారాంశం

తాను కొన్నప్పుడు ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈరోజుల్లో జీన్స్ ధరించనివారు చాలా అరుదు అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్స్ ధరించేవారే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారు వరకు వీటిని ధరించడం చాలా కంఫర్ట్ గా ఫీలౌతారు. అయితే సాధారణంగానే జీన్స్ ని ఎక్కువ సార్లు ఉతకం. రెండు, మూడు సార్లు వేసుకునన తర్వాత వాటిని ఉతకుతారు. ఇది చాలా కామన్. కానీ ఓ మహిళ దాదాపు 18 సంవత్సరాలుగా ఒకే జీన్స్ ధరిస్తోంది. దానిని ఆమె కొన్న తర్వాత ఒక్కసారి కూడా ఉతకలేదట. ఆ జీన్స్ పై కనీసం మరకలు గానీ, దుమ్ము  కానీ ఏమీ లేకపోవడం విశేషం. తాను కొన్నప్పుడు ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంగ్లాండ్ యార్క్ షైర్ కు చెందిన సాండ్రా విల్లిస్ అనే మహిళ 18 సంవత్సరాల క్రితం రెండు డెనిమ్ జీన్స్ కొనుగోలు చేసింది. వాటిని ఆమె ఇప్పటి వరకు ఏడాది కి ఒక్కసారి మాత్రమే ధరించిందట. అందుకే వాటిపై ఎలాంటి మరకలు పడలేదట. మరకలు పడనప్పుడు ఉతకడం ఎందుకు అని ఆమె వాటిని ఉతకనే లేదట. ఈ 18ఏళ్లలో ఆమె వాటిని ఒక్కసారి కూడా ఉతకలేదు. అవి కూడా చాలా కొత్తగా కనిపిస్తుండటం విశేషం. మరో రెండేళ్ల పాటు కూడా ఉతకకుండా వాటిని వాడి రికార్డు క్రియేట్ చేయాలని అనుకుంటుందట.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంతకాలం జీన్స్ ఉతకకుండా ఎలా ధరించావు అని ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఎంత సంవత్సరానికి ఒక్కసారి వేసుకున్నా.. 18 సంవత్సరాల్లో 18 సార్లు వేసుకొనే ఉంటావు కదా.. అయినా ఎందుకు ఉతకలేదు అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఆమె స్పందించింది. తాను వాటిని ఉతకకపోయినా శుభ్రంగా తుడిచి పెడతానని చెప్పింది. తన దగ్గర ఇతర ఫ్యాంట్స్ చాలా ఉన్నాయని, అందుకే వీటిని చాలా తక్కువగా వాడనని చెప్పడం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !