భర్త చనిపోయిన 14నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!

Published : Jul 22, 2021, 02:38 PM IST
భర్త చనిపోయిన 14నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!

సారాంశం

అంతకు ముందే ఒకసారి అతనికి గుండెపోటు రావడంతో కృతిమ పద్ధతిలో తల్లిదండ్రులు కావాలని వారు అప్పుడే నిర్ణయించుకున్నారు.

భర్త చనిపోయిన 14 నెలల తర్వాత ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా తన భర్త కారణంగానే ఆమె ఈ గర్భం దాల్చడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో  చోటుచేసుకోగా.. ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బర్గ్ భర్త స్కాట్ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించాడు. అంతకు ముందే ఒకసారి అతనికి గుండెపోటు రావడంతో కృతిమ పద్ధతిలో తల్లిదండ్రులు కావాలని వారు అప్పుడే నిర్ణయించుకున్నారు.

 ఇద్దరూ ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఆశ్రయించి పిండాలను భద్రపరిచారు. భర్త మరణించిన ఆరు నెలల అనంతరం సారా ఆ క్లినిక్‌కు వెళ్లి ప్రక్రియను పూర్తి చేసింది. గత నెలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే పద్ధతిలో మరో పిండాన్ని కూడా భద్రపరిచామని, వచ్చే ఏడాది చివర్లో మరో బిడ్డను కంటానని సారా తెలిపింది.

తన బిడ్డలోనే కోల్పోయిన భర్తను చూసుకుంటానని ఆమె చెప్పింది. ఇక తన బిడ్డలను తండ్రి లోటు లేకుండా పెంచుతానని ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..