అత్తకు బాయ్ ఫ్రెండ్.. కోడలి ప్రకటన..!

Published : Jul 21, 2021, 07:51 AM ISTUpdated : Jul 21, 2021, 07:56 AM IST
అత్తకు బాయ్ ఫ్రెండ్.. కోడలి ప్రకటన..!

సారాంశం

తన అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ.. ఓ కోడలు ఈ ప్రకటన ఇవ్వడం గమనార్హం. రెండు రోజులు తన అత్తకు బాయ్ ఫ్రెండ్ లా ఉంటే డబ్బులు కూడా ఇస్తానంటూ ఆమె ప్రకటించడం విశేషం.

‘ వధువు కావలెను’, ‘వరుడు కావలెను’ అంటూ పేపర్లలో, వెబ్ సైట్లలో ప్రకటనలు ఇవ్వడం మీరు చూసే ఉంటారు. కానీ.. ఎక్కడైనా అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎక్కడైనా ప్రకటన ఇవ్వడం చూశారా..? అందులోనూ తన అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ.. ఓ కోడలు ఈ ప్రకటన ఇవ్వడం గమనార్హం. రెండు రోజులు తన అత్తకు బాయ్ ఫ్రెండ్ లా ఉంటే డబ్బులు కూడా ఇస్తానంటూ ఆమె ప్రకటించడం విశేషం.  ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ కోడలు తన 51ఏళ్ల అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది. రెండు రోజులపాటు అతను తన అత్త తో కాస్త సమయం గడిపి.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావాలని అందులో ఉంది. బాయ్ ఫ్రెండ్ వయసు 40-60 మధ్యలో  ఉండాలని ఆమె పేర్కొన్నారు.

అలా ఉన్నవారికి 960డాలర్లు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. బాయ్ ఫ్రెండ్ గా వచ్చేవారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు బాగా డ్యాన్స్ చేయడం కూడా వచ్చి ఉండాలని ఆమె షరతు పెట్టడం గమనార్హం. దీనికి సంబంధించిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..