హెలికాప్టర్ నుంచి బంగీ జంప్..50వ పుట్టినరోజు జరుపుకున్న నటుడు

Published : Sep 26, 2018, 07:04 PM IST
హెలికాప్టర్ నుంచి బంగీ జంప్..50వ పుట్టినరోజు జరుపుకున్న నటుడు

సారాంశం

 ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ తన 50వ పుట్టిన రోజును అత్యంత సాహసోపేతంగా జరుపుకొన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నిత్యం స్టంట్లు చేసే విల్ స్మిత్ రియల్ లైఫ్ లోనూ భారీ స్టంట్ చేశాడు. ఆరిజోనాలోని గ్రాండ్‌ కేనియన్‌ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బంగీ జంప్‌ చేశారు. 

అరిజోనా: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ తన 50వ పుట్టిన రోజును అత్యంత సాహసోపేతంగా జరుపుకొన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నిత్యం స్టంట్లు చేసే విల్ స్మిత్ రియల్ లైఫ్ లోనూ భారీ స్టంట్ చేశాడు. ఆరిజోనాలోని గ్రాండ్‌ కేనియన్‌ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బంగీ జంప్‌ చేశారు. సుమారు 550 అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి పర్వతాల మధ్య కిందికి దూకారు. 

అంతకుముందే తమ కుటుంబ సభ్యులను గ్రాండ్ కేనియన్ పర్వత శ్రేణుల్లో ఉంచిన విల్ స్మిత్ బంగీ జంప్ ద్వారా తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బంగీ జంప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు విల్ స్మిత్ ను ఉత్సాహ పరిచారు. 

గ్రాండ్ కేనియన్ పర్వతాలు చూసేందుకు తాను 1976లో తన తల్లిదండ్రులతో వచ్చినట్లు స్మిత్ తెలిపారు. ఆ సమయంలో పర్వతాల ఎత్తును చూసి భయపడ్డానని చెప్పుకొచ్చారు. మరోవైపు స్మిత్ సాహసోపేతమైన బంగీ జంప్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..