రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌పై ఎందుకు అంత ఇంటరెస్ట్? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published : Feb 19, 2022, 02:35 PM ISTUpdated : Feb 24, 2022, 09:52 AM IST
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌పై ఎందుకు అంత ఇంటరెస్ట్? నిపుణులు ఏం చెబుతున్నారు?

సారాంశం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌పై ఎందుకు అంత ఇంటరెస్ట్? 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన చూపు ఆ దేశం మీదనే ఎందుకు ఉంటుంది? కొందరు నిపుణులు ప్రకారం.. ఉక్రెయిన్ రష్యా పరిధి దాటిపోవద్దని పుతిన్ భావిస్తారు. ఉక్రెయిన్.. రష్యాకు క్రౌన్ వంటిదని ఫీల్ అవుతారు. ఉక్రెయిన్ ఎప్పటికీ రష్యా అనుకూల మిత్ర దేశంగానే ఉండాలని కోరుకుంటారు.  

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్(Ukraine) గురించే చర్చ నడుస్తున్నది. రష్యా(Russia) దేశం ఉక్రెయిన్‌ను దురాక్రమిస్తుందా? అనే అంశం చుట్టే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ సమీపంలో అంటే కేవలం కిలోమీటర్ల దూరంలోనే సుమారు 1.5 లక్షల రష్యా జవాన్లు మోహరించి ఉన్నారని పశ్చిమ దేశాలు, అమెరికా ఆరోపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి, రష్యాను వెనక్కి తగ్గించేందుకు ఈ దేశాలు దౌత్య మార్గాల్లో అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, వాటి ద్వారా ఆశించిన ఫలితాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) నుంచి రావడం లేదు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం, శాటిలైట్ చిత్రాల ద్వారా రష్యా మిలిటరీ(Military) మోహరింపు భారీగా ఉన్నదని, ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడవచ్చని అమెరికా భావిస్తున్నది. 

ఒపుక్, యెవపటోరియా రైల్‌యార్డ్ సహా ఉక్రెయిన్ నుంచి 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలోనూ పుతిన్ బలగాలు బలంగా ఉన్నాయి. డొనుజ్లావ్ కొలను, నొవూజర్నోయ్ వంటి చోట్ల యుద్ధ ట్యాంకులు, వాహనాలు ఉన్నట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. దీనికి తోడు రష్యా ప్రభుత్వం బెలారస్ దేశానికి తమ మిలిటరీని పంపింది. మిలిటరీ ఎక్సర్‌సైజ్ కోసం వారిని అక్కడికి పంపించింది. తద్వారా ఉక్రెయిన్‌ మూడు వైపులా రష్యా బలగాలు ప్రస్తుతం ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసే పథకంలో భాగంగానే రష్యా ఈ అడుగులు వేస్తున్నదని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి.

ఇంత వ్యతిరేకత వస్తున్నా.. యుద్ధంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా వ్లాదిమిర్ పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు. ఆయనకు ఉక్రెయిన్ దేశంపై ఎందుకు అంత ఇంటరెస్ట్ వంటి ప్రశ్నలూ ఈ నేపథ్యంలోనే ముందుకు వస్తున్నాయి. ఈ అంశంపై కొందరు నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన ఫియోనా హిల్ ప్రకారం, కొన్నేళ్లుగా పుతిన్ ఉక్రెయిన్‌పై గ్రిప్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2006 నుంచి ఆ దేశానికి గ్యాస్ కట్  చేశారు. పుతిన్ 22 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అవకావశం వచ్చిన ప్రతిసారీ ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచారు. గతంలో తమ చెప్పుచేతల్లో ఉన్న ఉక్రెయిన్‌ను తిరిగి తమ పరిధిలోకి తెచ్చుకోవాని ఆయన ఉబలాటపడతారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ పని జరగాలని, ఆ తర్వాత 2036 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగాలని కలలు కంటున్నారు. ఆయన రష్యన్ సామ్రాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. అందులో ఉక్రెయిన్ మాత్రం రష్యా నుంచి దూరంగా పశ్చిమ దేశాల వైపు వెళ్తున్నది. ఇది పుతిన్‌కు మింగుడు పడటం లేదు.

ఉక్రెయిన్‌ రష్యాకు అనుబంధంగా.. లేదా మిత్రపక్షంగా ఉండాలని పుతిన్ బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రసంగాలు, వ్యాసాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 2015లో ఆయన చేసిన ఓ ప్రసంగంలో ఉక్రెయిన్‌ను రష్యాకు కిరీటం అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా భాగాన్ని రష్యా ఆక్రమించిన ఏడాది తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

2021లోనూ ఆయన ఓ వ్యాసంలో రష్యా, ఉక్రెయిన్ ఒకే దేహం గల మనిషి వంటివని పేర్కొన్నారు. విచ్ఛిన్న శక్తులు రష్యా, ఉక్రెయిన్ మధ్య గోడలు నిర్మిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా మదర్ రష్యాతో ఉక్రెయిన్ ఎందుకు విడిపోవద్దంటూ అంటూ ఓ చారిత్రక కోణాన్ని చర్చించారు.

పుతిన్ తన పాలన జార్ చక్రవర్తుల తరహా లేదా సోవియెట్ యూనియన్ పాలకుల తరహా ఉండాలని భావిస్తున్నారని అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి జాన్ సైఫర్ తెలిపారు. రష్యా అంటే ప్రపంచ దేశాలు వణికిపోయేలా.. గౌరవించేలా.. పెద్దన్నలా చూసుకునేలా చేయాలని అనుకుంటారని అన్నారు. ఇతర దేశాలు తమ పరిష్కారాల కోసం రష్యాకు రావాలని ఆయన ఆశిస్తుంటారని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..