పొంతనలేని రష్యా మాటలు.. ఉక్రెయిన్ సమీపంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల మోహరింపు.. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

Published : Feb 19, 2022, 01:40 PM ISTUpdated : Feb 19, 2022, 01:45 PM IST
పొంతనలేని రష్యా మాటలు.. ఉక్రెయిన్ సమీపంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల మోహరింపు.. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

సారాంశం

ఉక్రెయిన్ దేశం చుట్టూ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేవు. పశ్చిమ దేశాలు, రష్యాకు మధ్య యుద్ధ వాతావరణానికి ఉక్రెయిన్ వేదికగా మారింది. అయితే, రష్యా ప్రభుత్వం తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. కానీ, శాటిలైట్ చిత్రాలు మాత్రం ఇందుకు భిన్నమైన వాస్తవాలను చెబుతున్నాయి.  

న్యూఢిల్లీ: యూరప్(Europe) సహా ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఉక్రెయిన్(Ukraine) చుట్టే ఉన్నాయి. పరిస్థితులు మళ్లీ ఒక్కసారిగా రెండో ప్రపంచ యుద్ధం అనంతర కోల్డ్ వార్‌‌(Cold War)ను చేరతాయా? అనే ఆందోళనలు వెల్లడి అవుతున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా(Russia)కు మధ్య యుద్ధ మేఘాలు ఆవరించాయి. ఏ క్షణంలోనైనా రష్యా దాడి చేయవచ్చని అమెరికా చేసిన ప్రకటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఆగమేఘాల ప్రకటనల తర్వాత రష్యా ప్రభుత్వం తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరడం లేదు. రష్యా మాటలకు విరుద్ధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని శాటిలైట్ చిత్రాలు(Satellite Images) వెల్లడించాయి.

అమెరికాలోని కొలరాడోలో గల స్పేస్ టెక్నాలజీ కంపెనీ మక్సార్‌కు చెందిన హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు రష్యా చెబుతున్న మాటలకు విరుద్ధమైన విషయాలను చూపిస్తున్నది. ఉక్రెయిన్ సమీపంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు రోజుల్లో గల మార్పులకు సంబంధించిన చిత్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఈ చిత్రాల ద్వారా మనకు కొన్ని విషయాలు వెల్లడి అవుతున్నాయి. ఉక్రెయిన్ సమీపంలో కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలకు రష్యా ప్రభుత్వం మిలిటరీ ఎక్విప్‌మెంట్ తరలించినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలో దాని మిలిటరీ కార్యకలాపాలనూ ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. లిడా ఎయిర్‌ఫీల్డ్, లేక్ డొనుజ్లావ్, మిలెరోవో ఎయిర్‌ఫీల్డ్, వాలుయికీ వంటి లొకేషన్‌లలో మిలిటరీ కదలికలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాల మోహరింపులను తెలిపాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆరోపించాయి. ఉక్రెయిన్‌ను దురాక్రమిస్తుందనీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కానీ, ఈ ఆరోపణలను రష్యా ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఉక్రెయిన్‌పై దాడి చేయమని స్పష్టం చేసింది. అయితే, ఉక్రెయిన్ దేశాన్ని నాటో కూటమిలో చేర్చుకోవద్దని, అలాగే, ఉక్రెయిన్‌లో నాటో బలగాలు, పశ్చిమ దేశాల సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను పశ్చిమ దేశాలు తిరస్కరించాయి. ఈ తిరస్కరణ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

సంక్షోభం మూలాలు ఇక్కడే

రష్యా సామ్రాజ్యంలో కొన్ని శతాబ్దాలుగా ఉక్రెయిన్ దేశం భాగంగా ఉన్నది. ఆ తర్వాత అది సోవియెట్ యూనిన్ దేశాల్లోనూ భాగంగా ఉన్నది. కానీ, 1991లో యూఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత ఉక్రెయిన్ దేశం రష్యా లెగసీ నుంచి బయటకు వెళ్లింది. స్వాతంత్ర్యం పొంది పశ్చిమ దేశాలకు దగ్గరవ్వ సాగింది. రష్యా నుంచి పశ్చిమం వైపు ఎంతగా దగ్గరయ్యిందంటే.. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాలను వ్యతిరేకించిన రష్యా అనుకూల రాష్ట్రపతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 2014లో ఆ రాష్ట్రపతి వైదొలగాల్సి వచ్చింది. కాగా, ఉక్రెయిన్ తూర్పు భాగం క్రిమియన్ పెనిన్సులానూ రష్యా తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వేర్పాటువాదులను ఎగదోసి ఉక్రెయిన్ దేశానికి వ్యతిరేకంగా ఘర్షణలకు పాల్పడుతున్నట్టు వాదనలు వచ్చాయి. రష్యానే ఆయుధాలు, ట్రూపులను పంపిస్తున్నదని ఆరోపణలు రాగా.. తమకు సంబంధం లేదని, అది వారి స్వచ్ఛంద నిర్ణయాలేనని రష్యా తొలుత కొట్టిపారేసింది. కానీ, అక్కడ రెఫరెండం నిర్వహించాక వారు రష్యాలో చేరుతామని ప్రకటించడంతో ఆ ప్రాంతం ఇక రష్యాలో భాగమని పుతిన్ ప్రకటించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..