హెలికాప్టర్ కూలి.. ఐదుగురి దుర్మరణం

Published : Jan 30, 2021, 10:10 AM IST
హెలికాప్టర్ కూలి.. ఐదుగురి దుర్మరణం

సారాంశం

మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్‌ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది.

హెలికాప్టర్ కూలి.. ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన క్యూబాలో చోటుచేసుకుంది. కాగా.. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్‌ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్‌ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది.

 అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

అమెరికా సైనికులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు.? అస‌లేం జ‌రుగుతోంది.?
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?