అయితే.. డబ్ల్యుహెచ్ఓ మాత్రం.. చైనాకి మద్తతుగా మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ డబ్ల్యుహెచ్ఓపై కన్నెర్ర చేశారు. చైనా కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీ లాగా పని చేస్తోందని.. అలా చేస్తున్నందుకు సిగ్గుపడాలని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై మండిపడ్డారు. డబ్ల్యుహెచ్ఓ చైనాకి వత్తాసు పలుకుతోందంటూ ట్రంప్ మండిపడ్డాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్.. చైనా నుంచి పుట్టుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపంగా ఉన్నారు. అయితే.. డబ్ల్యుహెచ్ఓ మాత్రం.. చైనాకి మద్తతుగా మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ డబ్ల్యుహెచ్ఓపై కన్నెర్ర చేశారు. చైనా కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీ లాగా పని చేస్తోందని.. అలా చేస్తున్నందుకు సిగ్గుపడాలని ట్రంప్ పేర్కొన్నారు.
తాజాగా.. ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో చైనా పై, దానికి మద్దతుగా నిలుస్తున్న డబ్ల్యూ హెచ్ వో పై మండిపడ్డారు. చైనాకి సపోర్ట్ చేస్తున్నందుకు డబ్ల్యూ హెచ్ వో సిగ్గుపడాలన్నారు. కాగా.. చైనా కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఇన్నివేల, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.
డబ్ల్యూహెచ్ఓకి అమెరికా ప్రతి సంవత్సరం 500 మిలియన్ డాలర్లు నిధులు అందజేస్తోందని..కానీ చైనా మాత్రం కేవలం 38 మిలియన్ డాలర్లు మాత్రమే సమకూరుస్తుందని చెప్పారు. నిధుల సంగతి పక్కన పెడితే.. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనైనా డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన వారికి అలా ఊరికే వదిలేయడం కరెక్ట్ కాదని చెప్పారు.
అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్నాయని.. తాను మళ్లీ ప్రెసిడెంట్ గా గెలవడం చైనాకి ఇష్టం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే.. చైనా కారణంగానే అమెరికాలో బిలియన్స్ డాలర్స్ వస్తున్నాయని ఆయన అన్నారు.
తనకి కాకుండా చైనా.. మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్కు చైనా మద్దతు ఇస్తోందన్నారు. జో బిడెన్కునే తదుపరి అమెరికా అధ్యక్షుడిగా చూడాలని చైనా భావిస్తోందన్నారు.
ఇదిలా ఉండగా... మొన్నటి వరకు ఈ వైరస్ చైనా ల్యాబ్ లో పుట్టిందని ట్రంప్ ఆరోపించారు. కాగా.. అది వాస్తవం కాదని అమెరికా ఇంటిలిజెన్స్ బృందం తేల్చి చెప్పింది. ఈ నిఘా కేంద్రం తాజాగా.. తన పరిశోధనలో ఓ విషయాన్ని కన్ఫామ్ చేసింది. కరోనా వైరస్ మానవ సృష్టికాదని చెప్పింది. అలాగే అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని వివరించాయి.
ఈ ఇన్ ఫెక్షన్ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది గుర్తించనున్నట్లు వెల్లడించాయి.
‘కరోనా వైరస్ మానవ సృష్టి, జన్యు మార్పిడి ద్వారా వచ్చింది కాదని శాస్త్రవేత్తల్లో చాలా వరకూ ఏకాభిప్రాయం ఉంది. నిఘా సంస్థలు కూడా ఈ వాదనతో ఏకీభవించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి వెలువడుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. ఇన్ ఫెక్షన్ సోకిన జంతవులకు దగ్గరగా మానవులు వెళ్లడం వల్ల ఈ వైరస్ వచ్చిందా లేక చైనాలోని వుహాన్ లో ఉన్న ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది దీని ద్వారా నిర్థారిస్తాం’అని జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.