కోవిద్ 19 : క్వారంటైన్ లో WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్

By AN TeluguFirst Published Nov 2, 2020, 9:20 AM IST
Highlights

ప్రపంచ ఆరోగ్య సంస్థ  WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆదివారం క్వారంటైన్ లోకి వెళ్లారు. తాను కలిసిన ఒకరికి కోవిద్ 19 పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి వెళ్లినట్టు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తను బాగానే ఉన్నానని, ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు.

WHO నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉన్నానని కొద్ది రోజుల పాటు ఇంటినుండి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు వైరస్ వ్యాప్తి నిరోధంలో ఇది చాలా కీలకమని, క్వారంటైన వల్ల కోవిద్ 19 గొలుసును తెగ్గొట్టొచ్చునని, వైరస్ ను బలహీనం చేయచ్చని ట్వీట్ చేశారు.  

జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అందించిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 46 మిలియన్లు దాటింది. COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 1,195,930 కు చేరుకుంది.

మార్చి 11 న WHO  COVID-19 ను మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు యునైటెడ్ స్టేట్స్, భారత్,  బ్రెజిల్లో నమోదయ్యాయి.

ఇదిలావుండగా, భారత్ లో కరోనావైరస్ కేసులు 81.84 లక్షలకు చేరుకున్నాయి. ఆదివారం 46,963 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కరోనావైరస్ కేసులు ఇప్పటికి 81,84,082 ఉన్నాయి.

మొత్తం కరోనావైరస్ కేసులలో 74,91,513 కోలుకున్న కేసులు మరియు 570458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మూడు రోజులుగా COVID-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షలలోపే ఉంది. 470 కొత్తగా నమోదైన మరణాలతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,22,111 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ సమాచారం.

click me!