నాకు ఇంతే వచ్చు.. బాస్కెట్ బాల్ టాలెంట్ చూపించిన ఒబామా

Siva Kodati |  
Published : Nov 01, 2020, 03:25 PM IST
నాకు ఇంతే వచ్చు.. బాస్కెట్ బాల్ టాలెంట్ చూపించిన ఒబామా

సారాంశం

అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో బరాక్ ఒబామా విభిన్నంగా వ్యవహరించారు. ప్రజలతో సామాన్యుడిలా మమేకమవ్వడంతో పాటు వివిధ దేశాలతో అమెరికా సంబంధాలను పునరుద్ధరించారు. 

అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో బరాక్ ఒబామా విభిన్నంగా వ్యవహరించారు. ప్రజలతో సామాన్యుడిలా మమేకమవ్వడంతో పాటు వివిధ దేశాలతో అమెరికా సంబంధాలను పునరుద్ధరించారు.

అందుకే ఆయనను నోబెల్ శాంతి బహుమతి సైతం వరించింది. ఇక ప్రస్తుతానికి వస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో ఆయన బిజీబిజీగా ఉన్నారు. వీలైనంత ఎక్కువ సమయం డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తరుపున ప్రచారంలో గడుపుతున్నారు.

శనివారం నాటి ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని ఓ స్కూల్‌కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా తనలోని బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ను బయటపెట్టారు. అక్కడి జిమ్‌లోని బాస్కెట్‌ బాల్‌ కోర్టులోకి అడుగుపెట్టి బాల్‌ను నెట్‌లో పడేలా వేశారు. 

ఆ వెంటనే ‘నాకు ఇంతే వచ్చు!’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు ఒబామా. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న ప్రముఖులు, సామాన్యులు ఒబామాను ప్రశంసిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?
ప్ర‌పంచంలో జైలు లేని దేశం ఏదో తెలుసా.? అత్యంత సుర‌క్షిత‌మైన ప్ర‌దేశం ఇదే