డోనాల్డ్ ట్రంప్ కి కరోనా వైరస్ పరీక్షలు..?

By telugu news teamFirst Published Mar 10, 2020, 11:06 AM IST
Highlights

ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ట్రంప్.. కరోనా సోకిన ఇద్దరు ప్రతినిధులను కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే... ట్రంప్ ని కలిసే సమయానికి సదరు ఇద్దరు ప్రతినిధులకు ఇంకా వైరస్ నిర్థారణ కాకపోవడం గమనార్హం.
 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారా..? ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకేసింది. అందులో అమెరికా కూడా ఉంది. కాగా..  ఈనేపథ్యంలో ట్రంప్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారనే వార్తలు మొదలయ్యాయి.

అయితే దీనిపై స్పందించిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్  స్పందించారు. అయితే.. తనకు తమ అధ్యక్షుడు ట్రంప్ వైద్య పరీక్షలపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. వైట్ హౌస్ వైద్యాధికారి నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఈ విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పారు.

Also Read కరోనా భయం వెంటాడుతున్నా.. తోటి మనిషికి అండగా: చైనీయుల మానవత్వం...

ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ట్రంప్.. కరోనా సోకిన ఇద్దరు ప్రతినిధులను కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే... ట్రంప్ ని కలిసే సమయానికి సదరు ఇద్దరు ప్రతినిధులకు ఇంకా వైరస్ నిర్థారణ కాకపోవడం గమనార్హం.

వీలైనంత త్వరగా ట్రంప్ వైద్య పరీక్షలపై వైట్ హౌస్ నుంచి సమాధానం వచ్చేలా చూస్తామని పెన్స్ తెలిపారు. తాను మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని స్పష్టం చేశారు. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. ట్రంప్ కి ఎలాంటి పరీక్షలు చేయించలేదని వైట్ హౌస్ అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... కాలిఫోర్నియా తీరంలో నిలిపి ఉంచి గ్రాండ్ ప్రిన్సెస్ నౌక నుంచి తొలి ప్రయాణికుల బృందాన్ని బయటకు తీసుకువచ్చారు. వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నారు. మరో 900మందిని ఈ రోజు విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా.. ఆ నౌకలో మొత్తం 3500మంది ఉన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 24మంది ప్రాణాలు కోల్పోయారు. 

click me!