మధ్యంతర ఎన్నికల ఫలితాలు: ట్రంప్ కు షాక్, సీఎన్ఎన్ జర్నలిస్ట్‌ పాస్ రద్దు

By narsimha lodeFirst Published Nov 8, 2018, 2:46 PM IST
Highlights

మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం‌ప్‌కు ఎదురు దెబ్బ తగిలింది

వాషింగ్టన్:  మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం‌ప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఫలితాలతో ఖిన్నుడైన ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు. సీఎన్ఎన్ జర్నలిస్ట్ జిమ్ అకోస్టా ప్రెస్ పాస్ ను రద్దు చేశారు. వైట్‌హౌజ్‌లో జిమ్ అకోస్టా‌ ప్రవేశించకుండా నిషేధం విధించారు.

బుధవారం నాడు  విడుదలైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో  ప్రతినిధుల సభల్లో  డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు పై చేయి సాధించారు. సెనేట్‌లో  రిపబ్లికన్లు ఆధిపత్యాన్ని నిలుపుకొన్నారు.

ఈ ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రంప్  మీడియాపై విరుచుకుపడ్డారు.  మీడియా తప్పుడు ప్రచారమే తమ పార్టీ ఓటమికి కారణమని పరోక్షంగా  విమర్శలు గుప్పించారు. అయితే  ఈ సమావేశంలో సీఎన్ఎన్ జర్నలిస్ట్ జిమ్ అకోస్టా ట్రంప్‌ను ప్రశ్నలను కురిపించాడు.

వలసదారులపై ట్రంప్ విధానాలు ఒక రకమైన  దాడే  అంటూ జిమ్ అకోస్టా ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో  ట్రంప్ సహనం కోల్పోయిన ట్రంప్ జిమ్ అకోస్టాపై విరుచుకుపడ్డారు. నిజం చెప్పనా... అధ్యక్షుడిగా నేనేం చేయాలో నాకు తెలుసు.  మీరు వార్తా సంస్థను సరిగ్గా నడిపించుకోండి. అలాగే రేటింగ్స్‌ను పెంచుకోండి’  అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. 

 ఈ క్రమంలో మరో ప్రశ్న అడిగేందుకు అకోస్టా సిద్ధమవుతుండగా.. కూర్చో.. అతడి నుంచి మైక్రోఫోన్‌ లాక్కోండి అంటూ ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిమ్ మరోసారి వైట్‌హౌజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని అడ్డుకొన్నారు. జిమ్ ప్రెస్ పాస్ ను రద్దు చేయడంతో వైట్‌హౌజ్‌లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. 
 

సంబంధత వార్తలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు: ప్రతినిధుల సభలో ట్రంప్‌కు షాక్

 

click me!