శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది?.. రిజైన్ చేసిన ప్రధాని ఏమన్నారు?

Published : Jul 09, 2022, 08:43 PM ISTUpdated : Jul 09, 2022, 08:50 PM IST
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది?.. రిజైన్ చేసిన ప్రధాని ఏమన్నారు?

సారాంశం

శ్రీలంకలో మరోసారి ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ ప్రజలు రాజధాని చేరారు. వారు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ముందే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారయ్యాయి. ప్రధాని విక్రమ్ సింఘే రాజీనామా ప్రకటించారు. ఒక వేళ అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఆ దేశ రాజ్యాంగం ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను, ప్రధాని విక్రమ్ సింఘే రాజీనామా వెనుక ఉద్దేశాన్ని చూద్దాం.

న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో ప్రజలు మరోసారి ఉగ్రరూపం చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు రాజధాని నగరం చేరి అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ముందు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి పౌరుల ముందుకు వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు? అనే ప్రశ్నలతోపాటు ఒక వేళ ఆయన అజ్ఞాతంలోనే రాజీనామా ప్రకటిస్తే ఏమిటనే అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. ఒక వేళ నిజంగానే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేస్తే ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అమలు చేయాల్సిన కీలక అంశాలను పరిశీలిద్దాం.

అధ్యక్షుడి రాజీనామాపై స్పష్టత రాకముందే ప్రధాని రానిల్ విక్రమ్ సింఘే తన రాజీనామా ప్రకటించారు. ఆయన అన్ని పార్టీల ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 

శ్రీలంక వాసుల్లో రాజపక్స కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఒక వేళ అన్ని పార్టీలతో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్లు కొనసాగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు విషయాలను పరిశీలిద్దాం.

అధ్యక్షుడు రాజీనామా ఏం చేయాలి?

పదవీ కాలం పూర్తి కాకముందే దేశ అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఆ ఖాళీని పార్లమెంటు సభ్యుడితో భర్తీ చేయాలి. ఇందుకోసం పార్లమెంటు.. అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఎన్నుకున్న ఆ అధ్యక్షుడు మిగితా పదవీ కాలం ముగిసే వరకు బాధ్యతలు నిర్వహిస్తారు.

ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టాలి?

అధ్యక్షుడు రాజీనామా చేస్తే.. ఆయన పదవీ కాలం పూర్తి చేయడానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను రాజీనామా చేసిన తర్వాత నెల రోజుల్లోపు మొదలు పెట్టాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

అధ్యక్షుడు రాజీనామా చేసిన మూడు రోజుల్లోపు పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో పార్లమెంటు సెక్రెటరీ జనరల్.. సభ్యులకు అధ్యక్షుడి రాజీనామా గురించి తెలియజేయాలి. ఆ పోస్టు కోసం పార్లమెంటు సభ్యులు ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఒక వేళ ఒకరి కంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తే.. రహస్య ఓటింగ్‌లో మెజార్టీ వచ్చిన వ్యక్తిని అధ్యక్షుడిగా పరిగణించాల్సి ఉంటుంది.

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు పరిస్థితి ఏమిటీ?

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయనే అధ్యక్షుడు.  అలాగే.. అప్పటి వరకు ప్రధానిగా ఆయన క్యాబినెట్ సభ్యుల్లో ఒకడిని నియమించాల్సి ఉంటుంది. అదీ అవసరమైతేనే. 

పీఎం రాజీనామా.. అన్ని పార్టీల ప్రభుత్వం

ప్రభుత్వ కొనసాగింపు, పౌరుల రక్షణల దృష్ట్యా అన్ని పార్టీల నేతలు చేసిన సూచనలు, సిఫారసులను అంగీకరించి అన్ని పార్టీల ప్రభుత్వ ఏర్పాటుకు దారి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని రానిల్ విక్రమసింఘే వెల్లడించారు. అన్ని పార్టీల ప్రభుత్వం తప్పక ఏర్పడాలని తాను అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్టు పీఎం కార్యాలయం తెలిపింది. దేశంలో చమురు, ఆహార సంక్షోభం ఉన్నదని, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీలంకకు రావాల్సి ఉన్నదని పేర్కొంది. ఈ ప్రభుత్వం రాజీనామా చేస్తే.. వెంటనే బాధ్యతలు చేపట్టడానికి మరో ప్రభుత్వం సిద్ధంగా ఉండటం చాలా అవసరం అని వివరించింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడటానికి ఐఎంఎఫ్ చర్చల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అన్ని పార్టీల ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంతర్జాతీయ సంస్థల నుంచి సహకారాన్ని వెంటనే పొందేలా దౌత్య పరంగా ఒత్తిడి తేవడం.. లేదా ఇతర మార్గాల్లోనూ ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !