కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న నీటి కొరత.. డబ్ల్యుహెచ్ఓ ఆందోళన

By AN TeluguFirst Published Dec 14, 2020, 1:57 PM IST
Highlights

హెల్త్ సెంటర్లలో నీటి కొరత.. కరోనా వ్యాప్తికి కారణమవుతోందని డబ్లుహెచ్ వో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో ఒకదానిలో నీరు అందుబాటులో లేదని వెల్లడించింది. ఈ కనీస సౌకర్యాల లేమి రోగులతో పాటు సిబ్బందిని కూడా ప్రమాదంలో పడేస్తుందని సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. 

165 దేశాల నుంచి సేకరించి సమాచారంతో ఐరాసకు చెందిన బాలల సంరక్షణ సంస్థ యునిసెఫ్ తో కలిసి ఈ నివేదికను రూపొందించింది. నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, పరిశుభ్రత లేకుండా వైద్యులు, నర్సులను విధులు నిర్వర్తించమనడం, పర్సనల్ సేఫ్టీ లేకుండా సేవలు అందించమనడం లాంటిదేనని చెప్పుకొచ్చింది. 

కొవిడ్ 19 కట్టడిలో ప్రాధమికమైన ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చాలా అవాంతరాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగాఈ దయనీయ పరిస్థితులతో సేద దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి అని డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.           
 
ప్రపంచ జనాభాలో మొత్తం వైద్యసిబ్బంది మూడు శాతమే.. అయితే కొవిడ్ బారిన పడిన వారిలో మాత్రం వైద్యసిబ్బందే 14 శాతం ఉన్నారని తెలిపింది. ఆరోగ్య కేంద్రాల్లో నీరు, పారిశుద్ధ్య సేవలు, శానిటైజేషన్ లేకుండా డాక్టర్లు, నర్సులను విధుల్లోకి పంపడం వారి ప్రాణాలకు మీదకు తెస్తుందని యునిసెఫ్ చీఫ్ హెన్నియెట్టా ఫోరే ఆందోళన వ్యక్తం చేవారు.

ప్రతి మూడింట ఒక ఆరోగ్య కేంద్రంలో చేతుల శుభ్రతకు హామీ లేదని, ప్రతి పదింటిలో ఒకదానిలో పారిశుద్ధ్య సేవలు అందుబాటులో లేవని ఆ నివేదిక వెల్లడించింది. పేదరికం, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న 47 దేశాల్లో ఈ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని వివరించింది. సగం కేంద్రాల్లో తాగునీటి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. 

click me!