నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్ !

By AN TeluguFirst Published Dec 14, 2020, 10:45 AM IST
Highlights

నైజీరియాలో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఏకంగా 400మంది విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారు. నైజీరియాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి దారుణాలు అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

నైజీరియాలో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఏకంగా 400మంది విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారు. నైజీరియాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి దారుణాలు అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో నైజీరియా అట్టుడికిపోతూనే ఉంది. ఈ సారి నిషేధిత మిలిటెంట్ల బృందం ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడికి తెగబడింది. అక్కడ చదువుకుంటున్న 400 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన విద్యార్థుల కోసం నైజీరియన్ ఆర్మీ గాలింపు చేపట్టింది. 

 నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో ఓ స్కూల్ లో మిలిటెంట్లు దాడి చేయనున్నారన్న సమాచారంతో నైజీరియన్ భద్రతా బలగాలు సంబంధిత స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే మిలిటెంట్లు మారణాయుధాలతో దాడికి దిగారు.

ఆ స్కూల్ లో మొత్తం 600మంది విద్యార్థున్నారు. 400మంది విద్యార్థులను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. భద్రతా బలగాల సహకారంతో 200 మంది విద్యార్థులు తప్పించుకోగలిగారు. మిలిటెంట్లు, భద్రతాబలగాల దాడులతో ఆ ప్రాంతంలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడింది.

కాగా, మొత్తం మీద ఆ బందీపోట్లు 400 మంది విద్యార్థులను ఎత్తుకుపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ పిల్లలను కాపాడాలంటూ భద్రతా బలగాలను వేడుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. నైజీరియాలో కొద్దిరోజుల క్రితమే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రైతులను బోకో హరమ్ మిలిటెంట్లు అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. 

ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 43 మంది రైతుల చేతులు, కాళ్లూ కట్టేసి అతికిరాతంగా గొంతు కోసి చంపేశారు. అదే చోట పనికి వెళ్లిన మరికొంత మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ ఘటన నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 

click me!