జాబ్ లోంచి తీసేశారని.. ఏకంగా షాపునే కూలగొట్టాడు..

Published : Apr 08, 2021, 02:05 PM IST
జాబ్ లోంచి తీసేశారని.. ఏకంగా షాపునే కూలగొట్టాడు..

సారాంశం

తనను జాబ్ నుంచి తొలగించారనే కోపంతో ఓ ఉద్యోగి చేసిన పని ఆ షాపుకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. నార్త్ కరోలినాలోని వాల్ మార్ట్ ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. తన కారుతో ఏకంగా షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లాడు. 

అమెరికాలోని నార్త్ కరోలినా థండర్ రోడ్ లోని వాల్ మార్ట్ లో ఈ ఘటన జరిగింది. లాసీ కార్డెల్ జెంట్రీ (32) అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. వాల్ మార్ట్ లోకి కారుతో దూసుకెళ్లిన లాసీ కార్డెల్.. మార్ట్ లోని వినియోగదారులను భయబ్రాంతులకు గురి చేశాడు. 

ఈ ఘటనలో మాల్ ఎంట్రెన్స్ తో పాటు లోపలి కొంత భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో వెంటనే మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మార్ట్ కు చేరుకున్న పోలీసులు లాసీ కార్డెల్ ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో కొద్దిసేపు షాపింగ్ మాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?