కరోనా ఎఫెక్ట్: ఇండియా నుండి న్యూజిలాండ్‌లోకి ఎంట్రీపై తాత్కాలిక నిషేధం

Published : Apr 08, 2021, 11:03 AM IST
కరోనా ఎఫెక్ట్: ఇండియా నుండి న్యూజిలాండ్‌లోకి ఎంట్రీపై తాత్కాలిక నిషేధం

సారాంశం

దక్షిణాసియా దేశం నుండి అధిక సంఖ్యలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాకు చెందిన ప్రయాణీకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా  న్యూజిలాండ్ నిలిపివేసింది.  

వెల్లింగ్టన్: దక్షిణాసియా దేశం నుండి అధిక సంఖ్యలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాకు చెందిన ప్రయాణీకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా  న్యూజిలాండ్ నిలిపివేసింది.

గురువారం నాడు న్యూజిలాండ్ సరిహద్దుల్లో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడ భారత్ కు చెందినవారివే కావడం గమనార్హం. భారతదేశం నుండి వచ్చే ప్రయాణీకుల కోసం న్యూజిలాండ్ లోకి  ప్రవేశించడాన్ని తాత్కాలికింగా నిలిపివేస్తున్నామని న్యూజిలాండ్ ప్రధాని జాకిందా అర్డెర్న్ చెప్పారు.

ఈ నెల 11వ తేదీ నుండి ఏప్రిల్ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని  ప్రధాని తెలిపారు.   న్యూజిలాండ్ సరిహద్దుల్లో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో అత్యధికంగా ఇండియన్ నుండి వచ్చినవే కావడం గమనార్హం.గత ఏడాది అక్టోబర్ నుండి నమోదైన కేసుల్లో ఈ నెల 7వ తేదీన నమోదైన కేసులే అత్యధికమని అధికారులు ప్రకటించారు. దీంతో న్యూజిలాండ్ వైద్య శాఖ అప్రమత్తమైంది.కరోనా ఐసోలేషన్ సెంటర్ పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడ ఈ వైరస్ బారినపడ్డారు. ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదు.

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?