చెఫ్ అవతారమెత్తిన ప్రపంచ కుబేరుడు.. సోష‌ల్ మీడియాలో బిల్ గేట్స్ రోటీ వీడియో వైర‌ల్ !

Published : Feb 03, 2023, 05:13 PM IST
చెఫ్ అవతారమెత్తిన ప్రపంచ కుబేరుడు..   సోష‌ల్ మీడియాలో బిల్ గేట్స్ రోటీ వీడియో వైర‌ల్ !

సారాంశం

Viral video: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త, ప్ర‌పంచ అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రైన బిల్ గేట్స్ ఇప్పుడు చెఫ్ అవతారమెత్తారు. అందులోనూ భారతీయ వంటకమైన రోటీని తయారు చేశారు. ఓ ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన ఒక వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Bill Gates makes roti with chef Eitan Bernath: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త, ప్ర‌పంచ అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రైన బిల్ గేట్స్ ఇప్పుడు చెఫ్ అవతారమెత్తారు. అందులోనూ భారతీయ వంటకమైన రోటీని తయారు చేశారు. ఓ ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన ఒక వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకెళ్తే.. అమెరిక‌న్ సెల‌బ్రిటీ చెఫ్ ఈటన్ బెర్నాథ్ తో క‌లిసి బిల్ గేట్స్ రోటీ త‌యారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. చెఫ్  తో క‌లిసి బిల్ గేట్స్ రోటీని త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఈ వీడియోలో క‌నిపించింది. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఈటన్ బెర్నాథ్ తానూ బిల్‌గేట్స్ క‌లిసి భార‌తీయ వంటక‌మైన‌ రోటీని త‌యారు చేశామ‌ని వెల్ల‌డించారు.

 

తమ కుకింగ్ సెషన్ వీడియోను ఈటన్ బెర్నాథ్ ట్విటర్ లో షేర్ చేశారు. 20 ఏళ్ల చెఫ్ ఇటీవల బీహార్ లో రొట్టెలు తయారు చేయడం నేర్చుకున్నాడు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడితో తన నైపుణ్యాన్ని పంచుకున్నారు. పిండిని తయారు చేయడం నుండి రోలింగ్ పిన్ సహాయంతో చదును చేయడం వరకు, వారు మొదటి నుండి చేశారు. రొట్టెలు తయారు చేసిన తరువాత వాటిని కొంచెం నెయ్యి లేదా వెన్నతో బ్రష్ చేయ‌డం క‌నిపించింది. '@BillGates, నేను కలిసి ఇండియన్ రోటీ తయారు చేశాం. నేను భారతదేశంలోని బీహార్ నుండి తిరిగి వచ్చాను, అక్కడ నేను గోధుమ రైతులను కలిశాను, వారు కొత్త ప్రారంభ విత్తన సాంకేతికతలకు కృతజ్ఞతలు తెలిపారు. రోటీ తయారీలో వారి నైపుణ్యాన్ని పంచుకున్న "దీదీ కీ రసోయి" క్యాంటీన్ల మహిళలకు ధన్యవాదాలు" అని వీడియో శీర్షిక పేర్కొంది. ఈ వీడియోకు విభిన్న కామెంట్ల వరద మొదలైంది. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే