బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హింస.. 10 మంది మృతి

By sivanagaprasad kodatiFirst Published Dec 30, 2018, 5:37 PM IST
Highlights

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు హింసాత్మంగా మారాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల చెలరేగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. రంగామతిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద అవామీ లీగ్ యూత్ ఫ్రంట్ నేత మహ్మద్ బషీరుద్దీన్ తన అనుచరులతో పోలీంగ్ స్టేషన్‌కు వెళుతుండగా... ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడులు చేశారు. 

ఈ ఘటనలో బషీరుద్దీన్ తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన చనిపోయాడు. దీంతో ఇరు వర్గాలు తుపాకులు, కర్రలతో దాడులకు దిగాయి.. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.

అలాగే నోక్‌హలీ ప్రాంతంలో ఓటింగ్ కేంద్రంలో దుండగులు ఓటింగ్ యంత్రాలను ఎత్తుకుపోవడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన కార్యకర్త ఓ పోలింగ్ స్టేషన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరపడంతో అతను మరణించాడు.

బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇవాళ 389 నియోజకవర్గాల్లో 40 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేతృత్వంలోని మహా కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. మరోవైపు షేక్ హసీనాను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈసారి 20 చిన్నా, చితకా పార్టీలను కలుపుకుని ‘‘ జాతీయ ఐక్య సంఘటన’’ పేరిట బరిలోకి దిగింది. 

click me!