ఇన్ హేలర్ లో విష సర్పం..!

Published : Mar 10, 2021, 02:10 PM IST
ఇన్ హేలర్ లో విష సర్పం..!

సారాంశం

పాము ఏకంగా ఇన్ హేలర్ లో దూరింది. అది చూసి సదరు యువతి షాకైపోయింది. 

విష సర్పాలు.. ఇళ్లల్లోకి చొరపడటం మనం చాలా సార్లు చూసే ఉంటాం. అంతెందుకు షూ లో దూరి చాలా మందిని కాటేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే.. ఓ యువతి మాత్రం పాముతో చాలా విచిత్ర సంఘటన ఎదురైంది. పాము ఏకంగా ఇన్ హేలర్ లో దూరింది. అది చూసి సదరు యువతి షాకైపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన యువతికి ఆస్తమా ఉండటంతో ఆమె ఇన్‌హేలర్ ఉపయోగిస్తోంది. ఇన్‌హేలర్‌ను వాడి పక్కన పెట్టిన సమయంలో ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము పిల్ల వచ్చి ఇన్‌హేలర్‌ లోపలకు దూరింది.


పామును యువతి సరైన సమయంలోనే గుర్తించడంతో ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పామును చూసిన వెంటనే యువతి పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి పామును పట్టుకున్నారు. పాము పిల్ల చిన్నదే అయినప్పటికి దాని విషం చాలా ప్రమాదకరమని వారు తెలిపారు. తాము ఇప్పటివరకు ఇళ్లలో అనేక చోట్ల పాములను చూశాం కానీ ఇన్‌హేలర్ లోపల పాము పిల్లను చూడటం ఇదే మొదటిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే